వరకట్నం తీసుకోనె వాడు గాడిద అనే ఒకప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటారు. కానీ ఇప్పుడు ఎవరూ ఆ సూత్రాన్ని ఫాలో అవ్వలేదు. తమ కొడుకుకు ఎంత కట్నం తెచ్చే అమ్మాయి వస్తుంది అని అబ్బాయి పేరెంట్స్ ఆలోచిస్తారు. అలాగే అబ్బాయిలు కూడా తనకూ అందంగా ఉన్న భార్య లేకున్నా కూడా బాగా కట్నం తీసుకోని వచ్చే భార్య వస్తే చాలు అనుకుంటూన్నారు..మొదట కట్నం నచ్చి పెళ్ళి చేసుకున్నా తర్వాత అధిక కట్నం కావాలని వేధిస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతుంది. తాజాగా ఓ గర్భవతి వరకట్న వేధింపుల కారణంగా చనిపొయింది.
భర్త వెధింపులు రోజు రోజుకు ఎక్కువ కావడంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన తెలంగాణా లో వెలుగు చూసింది. వివరాల్లొకి వెళితే.. హనుమకొండ బ్యాంక్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. గర్భిణీగా ఉన్న యూనియన్ బ్యాంకు మేనేజర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. ఆమె భర్త ప్రవీణ్ ఆమెను చంపి ఆత్మహత్య గా చిత్రీకరించారని అమ్మాయి బంధువులు ఆరొపించారు.
అసలు విషయాన్నికొస్తే.. రెండేళ్ల క్రితం అనూష అనే యువతికి ప్రవీణ్‌లో వివాహమైంది. అప్పటికే ఆమె ఆంధ్రా బ్యాంకులో క్లర్‌గా పనిచేసేది. ఆమె భర్త ప్రవీణ్ యూనియన్ బ్యాంకు లో ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు.. వాళ్ళ పెళ్ళి సమయానికి ఆమె అతనికి 25 లక్షలు కట్నం తెచ్చింది.. బంగారు ఆభరణాలు ఇచ్చినప్పటికీ ఇంకా కావాలని వెధించెవాడు. అనూష మీద అనుమానంతో ఆమెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు న్యాయం చెయలాని పోలీసులను డిమాండ్ చేశారు.. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని పోలీస్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఆమె మరణం తో అక్కడ రచ్చ జరుగుతుంది. ఈ దారుణ ఘటన పై పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి..