యువతికి ఆ వీడియోలు పంపిన అధ్యాపకుడు.. చివరికి ఓ రోజు?
ఎందుకంటే తమ దగ్గర చదువుకునే విద్యార్ధులను సొంత బిడ్డలా భావించడం మానేసి కామంతో ఊగిపోతూ వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. విద్యార్థి ఫోన్ నెంబర్ తీసుకుని ఉపాధ్యాయుడు మొదట నార్మల్ గా మెసేజ్ చేసేవాడు. ఆ తర్వాత అసభ్య ఫోటోలు వీడియోలు పంపించి.. వీడియో లో ఉన్నట్లు గానే మనం కూడా చేద్దాం అంటూ వేధించడం మొదలు పెట్టాడు. యువతి తన సోదరుడికి తన బాధను చెప్పగా ఇక సోదరుడు వచ్చి ఉపాధ్యాయుడు నిలదీశాడు. ఇక ఆ యువతి సోదరుడిపై ఉపాధ్యాయుడు దాడి చేయడంతో చివరకు పోలీసులను ఆశ్రయించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన జరిగింది.
తమిళనాడులో ఉన్న ఓ యువతి స్థానికంగా ఉన్న ఒక కళాశాలలో విద్యనభ్యసిస్తుంది. వాసుదేవన్ అనే ఒక అధ్యాపకుడు ఓ యువతి పై కన్నేశాడు. ఎలాగైనా లొంగదీసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే మాయమాటలు చెప్పి నెంబర్ తీసుకున్నాడు. ఇక కొన్నాళ్లపాటు మంచివాడు లాగే మెసేజ్ చేసాడు. కానీ ఆ తర్వాత అశ్లీల మెసేజ్ లు పంపడం మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత అశ్లీల వీడియోలు కూడా పంపడం చేశాడు. అయితే కొన్నాళ్లపాటు ఈ విషయం బయటకు చెప్పడానికి భయపడిపోయిన యువతీ.. తర్వాత తన సోదరుడికి విషయం చెప్పింది. దీంతో యువతి సోదరుడు కళాశాల అధ్యాపకుడుని నిలదీయగా ఇక ఆగ్రహంతో ఉపాధ్యాయుడు బాధితులపై దాడి చేయించాడు. దీంతో చివరికి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించి అతనిపై ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ క్రమంలోనే న్యాయం కావాలి అంటూ కళాశాల విద్యార్థులు అందరూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం గమనార్హం.