
జనాలు ఇలా కూడా ఉన్నారా.. ప్రేమ పెళ్లి చేసుకుంది.. అంతలోనే?
ఇక ఇటీవలే ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది మధ్యప్రదేశ్లోని చతర్పూర్ లో. ఉష పాల్ అనే మహిళ రైల్వేస్టేషన్లో టీ స్టాల్ పట్టుకొని జీవనం సాగిస్తూ ఉంది. ఓ వ్యక్తి టీ స్టాల్ వద్దకు వచ్చి టీ తాగాడు. తర్వాత తరచూ అక్కడికి వచ్చి టీ తాగడం మొదలు పెట్టాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది. కోర్టు సాక్షిగా ఇటీవలే పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇక ఆ తర్వాత అంతా సవ్యంగానే సాగింది. కానీ సదరు మహిళ ఆ తర్వాతే అసలు ప్లాన్ అమలులోకి తీసుకువచ్చింది. ముందుగా నగలు కావాలి అంటూ డిమాండ్ చేసింది సదరు మహిళ.
కొత్తగా పెళ్లయింది. భార్య కోరిన కోరిక తీర్చడం భర్తగా నా బాధ్యత అనుకొని ఇక భార్య కోరిక బంగారు ఆభరణాలను తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక ఆ తర్వాత బ్యాంకు ఖాతాలో దాచుకున్న సొమ్మును ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు. కాగా అదే అదనుగా భావించిన ఆ మహిళ సరుకులు తీసుకురావాలి అంటూ భర్తను బజారుకు పంపించింది. ఇక భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి ఊహించని ట్విస్ట్. ఇంట్లో భార్య కనిపించలేదు. వెతికిన ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి నగదు నగలు కూడా మాయమయ్యాయి. ఇక ఆ తర్వాత ఆమెకు అప్పటికే పెళ్లి అయిందని పిల్లలు కూడా ఉన్నారు అన్న విషయం బయటపడింది. దీంతో బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు..