
మహిళా భక్తులే అతని టార్గెట్.. ఏం చేస్తాడో తెలుసా?
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత ఎవరి మాటల గారడీలో పడకూడదని.. మోస పోకూడదు అని జనాలు గట్టిగా ఫిక్స్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో కూడా కాస్త కొత్తగా ఆలోచించి.. సైబర్ ఎటాక్ కి పాల్పడుతున్న వారు కొంతమంది అయితే.. మాటల గారడీతో బురిడీ కొట్టిస్తున్నారు మరికొంతమంది. ఇలా ఇటీవలి కాలంలో ఎంతో మంది కేటుగాళ్ల మాయలో పడి మోసపోతున్నారు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.
బంగారు పాల్యం లో ఆలయానికి వచ్చే మహిళా భక్తులను ఆంజనేయులు అలియాస్ సాయినాథ్ అనే వ్యక్తి చీటీలా పేరుతో నమ్మించడం మొదలు పెట్టాడు. ఓం శక్తి అమ్మవారి ఆలయ నిర్మాణం పేరుతో చీటీలు వహించాడు అంతే కాకుండా వారికి చెల్లనివేయించాడు. చెక్కులు ఇచ్చి దాదాపు 25 కోట్లతో పరారయ్యాడు కేటుగాడు. దీంతో మోసపోయామని గ్రహించిన మహిళలు వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. చిత్తూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో కూడా గుళ్ళలో ఇలాంటి తరహా ఘటనలు జరుగుతూనే ఉండడంతో మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని అటు పోలీసులు సూచిస్తూ ఉండటం గమనార్హం