లవర్ ని పెళ్లి చేసుకుంటా అంటూ భార్యను కోరాడు.. ఆమె నిరాకరించడంతో?
ఇక ఇదంతా చేసింది ఎవరో కాదు ఏకంగా అందరికీ ధైర్యం చెబుతూ సమస్యలు పరిష్కరించే వృత్తిలో కొనసాగుతున్న కానిస్టేబుల్. ఘటన విశాఖలో వెలుగులోకి వచ్చింది. రంపచోడవరం ప్రాంతానికి చెందిన సురేష్ 2009లో ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం విశాఖలో విధులు నిర్వహిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు కు చెందిన సునీత తో 2016 లో వివాహం జరిగింది. వీరికి నాలుగు నెలల పాప కూడా ఉంది. ఇక ఇటీవల కొద్దికాలం క్రితం భార్య పుట్టింటికి వెళ్లడంతో ఓ యువతి తో ప్రేమలో పడిపోయాడు సురేష్.
ఈ విషయాన్ని నేరుగా భార్యకు చెప్పాడు. ప్రియురాలిని రెండో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని నీ అంగీకారం కావాలంటూ కోరాడు. కాని ఆమె మాత్రం నిరాకరించింది. ఇక ఇటీవల సురేష్ ప్రేమిస్తున్న మహిళా సునీతకు ఫోన్ చేసి తాను సురేష్ ను ప్రేమించడం లేదు అని చెప్పింది. ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. ఈ క్రమంలోనే మనస్తాపం చెందిన సురేష్ భార్యకు ఫోన్చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి చివరికి ఉరి వేసుకున్నాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..