మద్యం మత్తులో కొడుకు నిజం చెప్పాడు.. తల్లి జైలుకెళ్ళింది?

praveen
మద్యం తాగితే నిజాలు బయటకు వస్తాయి అని చెబుతూ ఉంటారు ఎంతోమంది మందుబాబులు. కొంతమంది ఇలా మద్యం లోపలికి వెళ్ళింది అంటే నిజాలు తన్నుకు వస్తూ ఇక అన్ని విషయాలను బయటకు చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటిదే చేసాడు. మద్యం మత్తులో మనసులో దాచుకున్న రహస్యాన్ని బయటకు చెప్పాడు. చెప్పకూడని రహస్యాలు బయట పెట్టడంతో చివరికి అది కాస్త ఊరంతా పాకిపోయింది. చివరికి ఆ యువకుడు మద్యం మత్తులో చేసిన పనికి ఇక అతని తల్లి జైలు పాలు కావాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్లో నగరంలో వెలుగులోకి వచ్చింది.


 ఒక మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పూడ్చి పెట్టింది. ఈ విషయం ఆ మహిళకు ఆమె కొడుకుకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అయితే మద్యం మత్తులో సదరు యువకుడు స్నేహితులకు అసలు విషయాన్ని చెప్పేసాడు. దీంతో రహస్యం బయటకు వచ్చేసింది. దీంతో ఇక ఈ విషయం ఊరంతా పాకిపోయింది. ఇక పోలీసులు రంగంలోకి దిగి సదరు మహిళను అదుపులోకి తీసుకొని కటకటాల వెనక్కి తోశారు. 50 ఏళ్లు సోను తన భర్త బబ్లు ను దారుణంగా హత్య చేసింది. అయితే భర్త తాగొచ్చి ప్రతిరోజు కొడుతూ వేధించేవాడని ఇక భర్త వేధింపులు తాళలేక పోయినా తాను స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేశాను అంటూ విచారణలో ఒప్పుకుంది సదరు మహిళ.


ఆమెకు 22 ఏళ్ల కుమారుడు ఉండగా.. అతడు డ్రగ్స్ కి బానిస గా మారిపోయాడు. మద్యం మత్తులో స్నేహితు ఎదుట తల్లి తండ్రిని చంపి బాత్రూంలో పూడ్చి పెట్టింది అన్న విషయాన్ని చెప్పాడు. దీంతో షాక్ అయిన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించడంతో ఇక సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు సదరు యువకుడు మద్యం మత్తులో చెప్పిన విధంగా బాత్ రూమ్ దగ్గర తవ్వకాలు మొదలు పెట్టారు.. కాగా గత పది రోజుల నుంచి బబ్లు ఊర్లో కనిపించడం లేదు అని స్థానికులు చెబుతు ఉండటం గమనార్హం. ఇక ఈ కేసుకు విచారణ చేస్తున్నారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: