
పెంపుడు కుక్క చనిపోతే.. ఎవరైనా ఇలా చేస్తారా?
కేవలం పెంపుడు కుక్కల యజమానులే కాదు అటు జంతువులు సైతం తమ యజమానుల పట్ల అంటే ప్రేమ విశ్వాసం చూపిస్తున్న ఘటనలు కూడా సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కపిల్ల హఠాత్తుగా చనిపోతే ఎవరైనా బాధపడతారు. రెండు మూడు రోజులు బాధపడటం ఇక ఆ తర్వాత కొత్త కుక్కపిల్లలు తెచ్చుకొని పెంచుకోవడం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం పెంపుడు కుక్క చనిపోయిందని షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. పెంపుడు కుక్క గురించి ఆలోచించినంతగా తన కుటుంబం గురించి మాత్రం ఆలోచించలేక పోయాడు.
పెంపుడు కుక్క చనిపోయిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కొవ్వూరు లో చోటుచేసుకుంది. దొమ్మేరు సావరానికి చెందిన శ్రీను అనే 36 ఏళ్ల వ్యక్తి చాలా కాలంగా ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. ఇటీవలే ఆ కుక్క చనిపోయింది. దీంతో శ్రీను ఎంతగానో మనస్థాపానికి గురయ్యాడు. కుక్క లేకుండా ఈ లోకంలో బ్రతకలేను అనుకున్నాడూ. చివరికి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా శ్రీను భార్య రాజమణి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..