ఓ దేవుడా నీకు దయలేదా.. హృదయ విదారక ఘటన?

praveen
సంతోషం గా సాగిపోతున్న ఎంతో మంది జీవితాల్లో విధి ఊహించని విషాదాన్ని నింపుతూ ఉంటుంది. దీంతో కుటుంబం మొత్తం శోకసంద్రం లో మునిగి పోతుంది. ఇక్కడ తల్లి కుమారుల  విషయం లో వీధి పగబట్టిన ట్లుగా  వ్యవహరించింది. ఎక్కడికి వెళ్ళినా ఆ తల్లి కుమారులు ఇద్దరు వెళ్తుంటారు. ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు. కానీ ఈ తల్లి కుమారుల ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతను చూసి విధి ఓర్వలేక పోయింది. చివరికి రోడ్డు ప్రమాదం రూపం లో మృత్యువు ఇద్దరిని కబళించింది.


 ఇటీవల ద్విచక్ర వాహనం పై బయలు దేరిన తల్లీకూతుళ్లు చివరికి రోడ్డు ప్రమాదం బారిన పడి మృత్యువు ఒడిలోకి చేరారు. ఇక తల్లి తమ్ముడు విగత జీవులుగా కనిపించడం తో కుమార్తెలు రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించింది. శ్రీకాకుళం జిల్లా పెదపాడు గ్రామం లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. రమణమ్మ భర్త పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. ఇక కుటుంబం వచ్చిన దాంట్లో సర్దుకు పోతూ ఎంతో సంతోషం గానే వుంది. ఇక ఇటీవల అచ్యుతాపురం లో ఉండే సోదరి ఇంట్లో పండుగ జరిగింది.


 దీంతో ఈ పండుగకు హాజరయ్యేందుకు కుమారుడు మణికంఠ తో కలిసి ద్విచక్ర  వాహనం పై వెళ్ళింది రమణమ్మ. ఇక పండగ రోజు బంధువుల తో సంతోషం గా గడిపి శుక్రవారం తెల్లవారు జామున తిరుగు ప్రయాణం అయ్యారు. అయితే ఇక తెల్లవారుజామున కావడంతో రోడ్డు పక్కనే ఉన్న ఒక కల్వర్టును గుర్తించలేదు మణికంఠ. దీంతో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అందులో పడిపోయింది. తెల్లవారుజాము కావడంతో ఎవరు గమనించలేదు. ఈ క్రమంలోనే తల్లి కుమారులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో రమణమ్మ ఇద్దరు కుమార్తెలు అరణ్యరోదనగా విలపించడం అందరిని కంటతడి పెట్టించింది. భర్త అప్పారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: