"ఆస్తి కోసం కన్న తండ్రినే" చంపడానికి సిద్ధం... ఆ తర్వాత?

VAMSI
డబ్బు... ఇప్పుడు అన్నిటికన్నా చాలా మందికి డబ్బే ముఖ్యం అయిపోతోంది. బంధాలు బంధుత్వాలు అన్ని డబ్బు తర్వాతే, డబ్బు ఉంటేనే మాటకు విలువ మనిషికి విలువ , ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించగలం అన్నది దాదాపు అందరి ఆలోచన. డబ్బే మన మనసుల్ని మార్చేస్తోంది, మెకానికల్ లైఫ్ కి అలవాటుపడేలా చేస్తోంది. ఆస్తి సంపాదించి ఇస్తేనే పిల్లలు కూడా తమ తల్లితండ్రులను గౌరవిస్తారు లేదంటే చాలా చులకనగా చూస్తారు అని అంటుంటారు. అయితే తాజాగా జరిగిన ఒక సంఘటన వింటే కడుపు తరుక్కుపోతుంది. ఆస్తుల కోసం అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు పొట్లాడుకోవడం చూశాం. అయితే ఆస్తి కోసం ఒక కొడుకు కన్నతండ్రినే హతమార్చాడు, ఆ తర్వాత చంపి పరారయ్యాడు.

మైసూరు విజయనగర పరిధిలో ఆస్తి కోసం ఓ కొడుకు కన్న తండ్రిని ఎయిర్‌ గన్‌తో షూట్‌ చేసి పరారైన సంఘటన కలకలం రేపింది. రేణుకా కళాశాలకు చెందిన ఆస్తి విషయంలో గత నెల రోజుల నుండి తండ్రి శివకుమార్, కొడుకు మధ్య ఘర్షణ జరుగుతోంది. కాగా ఆస్తిని తన పేరు మీద రాయాలని ఒత్తిడి తెస్తూ వున్నాడు. అయినా సదరు తండ్రి కొడుక్కి బాధ్యత తెలియదని గ్రహించి ససేమిరా అన్నాడు. అయితే ఎలాగైనా ఆస్తిని దక్కించుకోవాలని భావించిన కొడుకు తన స్నేహితులతో కలసి తండ్రి పై దాడికి దిగిన ఆ కొడుకు ఆ వివాదంలో తండ్రి పై ఎయిర్ గన్ తో కాల్పులు జరిపి తన ఫ్రెండ్స్ తో కలిసి పరారయ్యాడు.

ఆ శబ్దాలకు చుట్టు పక్కల వారు వచ్చి చూడగా గాయపడిన ఆ తండ్రిని చూసి హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం కొడుకు అతడి స్నేహితులు పరారీలో ఉండగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు . ఈయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. ఇలా ఈ ఆస్తుల కోసం కన్న తండ్రిని కడతేర్చాలని చూసిన కొడుకులు ఉన్నా లేకున్నా ఉపయోగం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: