దుబాయ్ లో ఉద్యోగం.. కానీ పాపం?

praveen
దబ్రకఅబ్ర అబ్రకాదబ్రా.. అంటూ తెలిసి తెలియని మంత్రాలు చదువుతూ అటు జనాలను బురిడీ కొట్టించే బాబాలు గురించి ఇప్పటి వరకు విన్నాం. మొన్నటివరకు మోసం అనే పేరు చెబితే ఇలాంటి బురిడీ బాబాలే ఎక్కువగా గుర్తొచ్చేవారు. జనాల సమస్యలనే ఆసరాగా చేసుకుంటూ మాయమాటలతో నమ్మిస్తూ బురిడీ కొట్టించి డబ్బులు దండుకునే వారు. అదేంటోగాని ఇటీవలికాలంలో బాబాల కంటే మేమేం తక్కువ అని అనుకుంటున్నారు ఏమో ఎంతోమంది మాయగాళ్ళు జనాలను బురిడీ కొట్టించడం మొదలు పెడుతున్నారు. అచ్చంగా బురిడీ బాబా లాగానే జనాల అవసరాలను క్యాష్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఇలా ఇటీవల కాలంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఎంతో మందిని ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయ మాటలతో నుంచి చివరికి నట్టేట ముంచేస్తున్నారు మాయగాళ్లు.

 దీంతో ప్రస్తుత సమయంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇలా ఇటీవల కాలంలో దుబాయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఎంతోమందిని బురిడీ కొట్టించిన నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి వచ్చారు ఈ ఘటన తోసారు. నగరం లోని మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటన. షేక్ అబ్దుల్ అనే వ్యక్తి జెమ్స్ టెక్ ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. చదువు పూర్తి చేసిన విద్యార్థులకు కోర్సులో శిక్షణ ఇస్తూ కన్సల్టింగ్ సర్వీసులను నిర్వహిస్తుంటాడు ఇతను.

 ఇక గత ఏడాది ఇతనికి ఒక ఫోన్ వచ్చింది.అభి హబీబ్ మహ్మద్ అలీ ఆండ్రూస్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. ఇక జేమ్స్ టేక్ ఇన్స్టిట్యూట్ లో వివిధ కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి దుబాయ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మాయమాటలతో నమ్మించాడు. అంతేకాదండోయ్ ఏకంగా ఇంటర్వ్యూలు కూడా నిర్వహించాడు. 2021 180 మందిలో 170 మంది సెలెక్ట్ అయ్యారు అంటూ మరింత నమ్మించాడు. ఉద్యోగం కావాలంటే కొంత మొత్తంలో చెల్లించాలంటూ 8.50 లక్షలు వసూలు చేశాడు. దుబాయ్ పంపించాడు. అక్కడికి వెళ్ళాక ఉద్యోగాలు కూడా వచ్చాయి. కానీ అతను చెప్పినట్టుగా 170 మందికి కాదు కేవలం 10 మందికే.. మిగతా వారు పర్యాటక వీసా లపై అక్కడే ఇరుక్కుపోయారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: