ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ హైవేపై కారు, కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన లోనావ్లాలోని షీలత్నే గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచే సుకుంది. కారు, కంటైనర్ ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పూణె రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోనావ్లాలోని షీలత్నే గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని
పోలీసు అధికారులు ఘటన గురించి చెప్పిన వివరాల ప్రకారం ఈ యాక్సిడెంట్ లో ఐదుగురు మృతి చెందారని, బాధితులు వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యుడిని (80 ఏళ్ల వృద్ధురాలు) కొల్హాపూర్‌కు తీసుకు వెళుతున్నారు.
ఈ సందర్భంలో ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. స్థానికుల సహా యంతో వారి మృతదేహాలను బయటకు తీయడంతో మొత్తం ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో నలుగురు పొరుగున ఉన్న థానే జిల్లాలోని మీరా రోడ్ ప్రాంతానికి చెందిన వారు కాగా, కారు డ్రైవర్ ముంబైలోని కుర్లాకు చెందినవాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం, వాహ నం అదుపు తప్పి డివైడర్‌ను దాటి రోడ్డుకు అవతలి వైపు నుంచి వస్తున్న కంటైనర్ ట్రక్కు మార్గంలోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనం బాగా దెబ్బతింది.
స్థానికులు అధికారులకు సమా చారం అందించడంతో హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏది ఏమైనా మితిమీరిన స్పీడు, మద్యం సేవించి వాహనాలు నడపడం, వాహనం నడిపేటప్పుడు అసమర్ధత ఇలాంటి కారణాల వల్లే ప్రతిరోజు దేశంలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి వేలమంది మరణిస్తున్నారు. ఈ యొక్క రోడ్డు ప్రమాదాలపై ప్రభుత్వాలు సరైన నియంత్రణ ఉంచి మద్యం తాగి నడపడం, మితిమీరిన వేగాన్ని నియంత్రించడం, ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం లాంటివి తగ్గించుకుంటే ఈ యొక్క ప్రమాదాలను కొంతైనా అరికట్టవచ్చు.