ఓరి నాయనో.. మందు తాగాడు సరే.. కానీ గిదేందీ?

praveen
ఒకప్పుడు రోడ్డు నిబంధనలు పాటించక పోయినా తప్పించుకునేందుకు వీలు ఉండేది. కానీ ఇటీవలి కాలంలో మాత్రం అలాంటి అవకాశమే లేకుండాపోయింది. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు తనిఖీలు నిర్వహించకపోయినా..  పోలీసు చేతిలో ఉన్న కెమెరాతో క్లిక్ మనిపించి నిబంధనలు పాటించని వాహనదారులకు చాలాన్ లను ఇంటికి పంపిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవేళ ఇక్కడ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ లేకపోయినా జరిమానాల  నుంచి మాత్రం తప్పించుకోలేక పోతున్నారు. ఎందుకంటే సిగ్నల్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిని గుర్తించి చలాన్లు వేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.

 ఇలా వాహనదారుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అటు జరిమానాల  నుంచి మాత్రం తప్పించుకోలేక పోతున్నాడు అని చెప్పాలి. ఇదిలా ఉంటే..  ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు అధికారులు. తాగి వాహనం నడపడం ద్వారా వారి ప్రాణాలకే కాదు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదంఅంటూ అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అదే సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఉండటం గమనార్హం. ఇలాంటి సమయంలోనే కొన్నిసార్లు పోలీసులకు వింత అనుభవం ఎదురవుతోంది.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. నాంపల్లి ట్రాఫిక్ పోలీసులు ఇటీవలే రైల్వే స్టేషన్ ఎదురుగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నిర్వహిస్తున్నారు.. ఈ క్రమంలోనే అటువైపుగా ఒక ద్విచక్ర వాహనంపై వ్యక్తి రావడానికి గుర్తించారు పోలీసులు. అతన్ని ఆపి  డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. దీంతో అతడు ఫుల్లుగా మద్యం తాగినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది.. దీంతో ఇక బైక్కు సంబంధించిన అన్ని పత్రాలను  చూపించాలంటు పోలీసులు అడిగారు. దీంతో మత్తులో ఉన్న అతను ఆగ్రహానికి గురై సహనం కోల్పోయాడు. చివరికి పోలీసుల ముందే తన బైక్ పెట్రోల్ ట్యాంక్ లో లైటర్ వెలిగించి విసిరేసాడు. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. పోలీసులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు. ఇక చివరికి ఆ మందు బాబు ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: