దుం మారో దుం.. టుబాకో అమ్మకం..!

MOHAN BABU
దేశ భవిష్యత్ అనేది యువత చేతుల్లోనే ఉంటుంది. మన భారతదేశానికి ఉన్న ప్రధాన వరం ఏంటంటే దేశంలో ఎక్కువగా యువకులు ఉండడం. మరి యువత ఏ వైపు వెళ్తోంది. టెక్నాలజీ వైపు చూస్తోందా.. లేక ధూమపానం వైపు చూస్తోందా.. ప్రస్తుతం  జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి. దేశంలో ప్రతిరోజు జరిగేటటువంటి రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా యువతే మరణిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి.. దేశంలో చాలా మంది యువత మత్తుకు బానిస అవుతున్నారు. సన్మార్గంలో వెళ్లాల్సిన వీరు వక్ర మార్గాన ముందుకు పోతున్నారు. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే రోజురోజుకు యువకులు పూర్తిగా మత్తుకు బానిస అవుతున్నారు. మరి కారణం ఏంటో తెలుసుకుందామా..?

 
బహిరంగంగా సిగరెట్ తాగడమే నేరం. అలాంటిది సిగరెట్ల లో రకరకాల ఫుడ్ ఫ్లేవర్స్ ను జోడించి మత్తు మసాలా దందా నడిపిస్తున్నారు. ధూమపానం తో వచ్చే అనర్ధాలను దృష్టిలో పెట్టుకొని బహిరంగ ప్రదేశాలలో, జనం గుమిగూడి ప్రాంతాలలో పొగతాగడం నిషేధించారు. ఇందులో భాగంగానే సిగరెట్ మరియు దానికి సంబంధించిన టొబాకో ప్రోడక్ట్స్ ఆక్ట్ అమల్లోకి వచ్చింది. అసలు సిఓటిపి ఆక్ట్ ఏం చెబుతుందో తెలుసుకుందాం. 2003 నుంచి అమలులోకి వచ్చింది సిఓటీపీ. బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడం నేరం.

 విద్యాలయాల పరిసరాల్లో టొబాకో అమ్మకాలు  నిషేధం. 2017 లో హుక్కా సెంటర్లపై తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. హుక్కా ను పూర్తిగా నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హుక్కా ఫ్రీ హైదరాబాద్ కోసం అప్పటి సీపీ మహేందర్ రెడ్డి కఠినమైన చర్యలు తీసుకున్నారు. సెక్షన్ అమలు చేసే నాటికే హుక్కా కు బానిసయిన యువత, ఇప్పటికి కూడా దాని నుండి బయటపడలేక పోతున్నారు. ఇప్పటికీ గుట్టుగా హుక్కా సెంటర్ ల  నిర్వహణ కొనసాగుతూనే ఉంది. సిఓటిపిఏ అమలులో ఉన్నా యదేచ్ఛగా టొబాకో  నమ్మకాలు సాగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: