కరోనా వ్యాక్సిన్ ఇవ్వమంటే.. కుటుంబ నియంత్రణ చేసారు?

praveen
ప్రస్తుతం కరోనా వైరస్ పోరాటంలో వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. రూపాంతరం చెందుతూ పంజా విసురుతున్న కరోనా వైరస్పై సమర్థవంతంగా పోరాటం చేసేందుకు ప్రతి ఒక్కరూ  టీకా వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఒకప్పుడు వాక్సిన్ విషయంలో అనుమానాలు అపోహలు వ్యక్తం చేస్తూ టీకా వేసుకోవడానికి వెనకడుగు వేసేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతోమంది వ్యాక్సిన్ పై అవగాహన పెంచుకుని స్వచ్ఛందంగా వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే ఎవరు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే వ్యాక్సిన్ వేసుకుంటూ ఉండడం గమనార్హం. కానీ ఇప్పటికీ కొంత మందికి వ్యాక్సిన్ విషయంలో సరైన అవగాహన మాత్రం ఉండడం లేదు. ఇలాంటి అమాయకులను టార్గెట్గా చేసుకుని ఎంతోమంది కేటుగాళ్లు చివరికి వ్యాక్సిన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. వ్యాక్సిన్ ఇస్తాము అంటూ అమాయకుల దగ్గర డబ్బులు గుంజి చివరికి ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చి తప్పించుకుంటున్న ఘటనలు కూడా తెర మీదికి వచ్చాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అతను ఒక కూలి.. రోజు పని చేయగా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటాడు. కరోనా వైరస్ వ్యాక్సిన్ పై ఎలాంటి అవగాహన లేదు.

 ఈ క్రమంలోనే కేటుగాడు సదరు రోజువారి కూలి ని మోసం చేసి చేయకూడని పని చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని ఉదయపూర్ జిల్లా ప్రతాప్ నగర్ లో చోటు చేసుకుంది. కైలాష్ పుత్ర బాబూలాల్ అనే వ్యక్తి కూలి పని చేసుకుంటూ ఉంటాడు. ఇటీవలే కైలాష్ తో నరేష్ అనే వ్యక్తి మాట కలిపాడు. 2000  ఇస్తే కరోనా వ్యాక్సిన్ ఇప్పిస్తాను అంటూ మాయమాటలతో నమ్మించాడు.. ఈ క్రమంలోనే కైలాష్ నరేష్ కి రెండు వేల రూపాయలు ఇవ్వక స్కూటీ మీద ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ కైలాష్ కు ఒక ఇంజక్షన్ ఇవ్వగా వెంటనే స్పృహ కోల్పోయాడు. ఇక ఆ తర్వాత లేచి చూసే సరికి షాక్.. కైలాష్ కు కుటుంబ నియంత్రణ చేశారు. దీంతో ఏం చేయాలో తెలియక కైలాష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: