నర్స్ పాడుబుద్ధి.. పేషెంట్ తో చాటింగ్.. చివరికి?

praveen
సాధారణంగా ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లకు అన్ని రకాల సర్వీసులు చేస్తూ ఉంటారు నర్సులు. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఉండడమే కాదు మందులు అందించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు అటు పేషెంట్లు అందరితో కూడా ఎంతో ప్రేమగా మాట్లాడుతూ మానవత్వానికి కేరాఫ్ అడ్రస్ గా కనిపిస్తూ ఉంటారు నర్సులు. కానీ ఇక్కడ ఒక నర్స్ మాత్రం కాస్త విచిత్రంగా ప్రవర్తించింది. పాపం పని చేయగా వచ్చిన డబ్బులు సరిపోలేదో ఏమో.. ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన ఒక పేషంట్ కు టోపీ పెట్టాలని ప్రయత్నించింది.

 ముందు నవ్వుతూ పరిచయం పెంచుకుంది ఆ తర్వాత ఫోన్ నెంబర్ తీసుకుని మెసేజ్ చేయడం మొదలు పెట్టింది. ఆసుపత్రికి వచ్చిన ఒక పేషెంట్ తో పరిచయం ఏర్పర్చుకొని ఆ తర్వాత భారీగా డబ్బులు గుంజాలి అని భావించిన సదరు నర్స్.. డబ్బులు ఇచ్చేందుకు పేషెంట్ నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడింది. చివరికి బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో చివరికి నర్సు కటకటాల పాలు కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పూణేలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పుణేకు చెందిన ఓ వ్యక్తి ఇటీవలే ఆరోగ్య సమస్యలు రావడంతో దగ్గరలో ఉన్న ఓ ఆస్పత్రికి వెళ్లాడు.

 అక్కడ ఓ మహిళ నర్స్ గా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఆస్పత్రికి వెళ్లిన పేషెంట్ తో సదరు నర్సు పరిచయం పెంచుకుంది. మాటలు కలిపి ఏకంగా పేషెంట్ ఫోన్ నెంబర్ కూడా తీసుకుంది.  ఆ తర్వాత ఆ పేషెంట్ తో చాటింగ్ చేయడం కూడా మొదలు పెట్టింది. కొన్నాళ్ళ వరకు బాగానే మాట్లాడిన నర్సు ఆ తర్వాత మాత్రం అతనిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. 20 లక్షలు ఇవ్వకపోతే నువ్వు చేసిన చాటింగ్ మొత్తం మెసేజ్ లు పబ్లిక్ లో పెడతాను రచ్చరచ్చ చేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడింది. ఇక రోజురోజుకీ సదరు నర్స్ వేధింపులు ఎక్కువై పోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి ఆ సదరు మహిళను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: