దావత్ కోసం మేకను దొంగిలించిన పోలీసులు.. ఎక్కడంటే..??

N.ANJI
సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటూ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారే దొంగగా మారాడు. ఆ అధికారి దొంగతనం చేసింది డబ్బు, బంగారం అనుకుంటున్నారా.. ఇంతకీ ఆ ఆఫీసర్లు ఏం దొంగతనం చేశాడంటే మేకలను ఎత్తుకెళ్లారు. అదేంటి పోలీసులు దొంగతనం చేయడం ఏంటి అని అనుకుంటున్నారా.. నిజమేనండి. ఒడిశాలో పోలీసులు న్యూ ఇయర్ వేడుకల కోసం మేకులను దొంగతనము చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రం బొలంగీర్ జిల్లాలో సింధికెల గ్రామానికి చెందిన సంకీర్తనగురు మేకలను మేపుతూ వాటినే జీవనోపాధిగా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక డిసెంబరు 31న అంతటా పండగ వాతావరణం ఉంటే.. ఆయన మాత్రం రోజూలాగే మేకలను మేపేందుకు వెళ్లారు. అయితే మధ్యాహ్నం తర్వాత తన మేకల మందలో రెండు మేకలు అదృశ్యం అయినట్లు గమనించి చుట్టూ పక్కల మొత్తం వెతికారు. కానీ వారికీ మేకల ఆచూకీ లభించలేదు.
అయితే వారు మేకలను మేపే ప్రాంతానికి సమీపంలోనే పోలీస్ స్టేషన్ ఉండటంతో సంకీర్తన గురు కూతురు చూడటానికి అటువైపు వెళ్ళింది. అక్కడ పోలీసులు మేకలు కొస్తుండం చూసి  తన తండ్రికి చెప్పంది. ఇక సంకీర్తన గురు వెంటనే గ్రామస్తులను వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అంతేకాదు.. అవి తమ మేకలని..దొంగిలించి విందు చేసుకుంటారా? అని సిబ్బందిని ప్రశ్నించారు. వారి మాటలను పోలీసులు పట్టించుకోకుండా ఏం చేసుకుంటారో.. చేసుకోండని బెదిరింపులకు గురి చేశారు.
ఇక ఈ విషయం మీడియా ద్వారా జిల్లా ఎస్పీ నితిన్ శుక్లాకర్ దృష్టికి వచ్చింది. ఎస్పీ పోలీస్ సిబ్బంది తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనంతరం ఘటనపై సమగ్ర విచారణ జరిపించి.. పోలీసులదే తప్పు అని తేల్చి చెప్పారు. ఇక దొంగతనాకి పాల్పడిన ఏఎస్ఐ సుమన్ మల్లిక్‌ను సస్పెండ్ చేశారు. నెట్టింట్లో ఈ వీడియో చూసిన నెటిజన్స్ బాధ్యత గల పోలీస్ అయి ఉండి మేకలను దొంగతనం చేయడంపై విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: