చనిపోయిన తల్లి కలలోకి వచ్చిందని.. కూతురు ఏం చేసిందో తెలుసా?

praveen
ఏంటో ఈ లోకం తీరు ఎప్పటికీ అర్థం కాని ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎందుకంటే సమాజంలో బ్రతుకుతున్న మనుషులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సినిమాల ప్రభావమా.. లేక మారుతున్న పరిస్థితుల ప్రభావమా అన్నది తెలియదు గానీ ఎంతో మంది మనుషులు మాత్రం దేవుడు ఇచ్చిన విలువైన ప్రాణాలను ఎంతో సులభంగా తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. బలవంతంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇష్టం లేకపోయినా కష్టంగా ప్రాణాలు తీసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా నే ముగిస్తున్నారు ఎంతోమంది.


 ఇలా ఇటీవలి కాలంలో చిన్నచిన్న కారణాలకే మనస్థాపం చెంది ఆత్మహత్యచేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతుంది అనే చెప్పాలి. ఇటీవలకాలంలో ఆత్మహత్యలకు పాల్పడటం ఒక ఎత్తయితే ఈ ఆత్మహత్యలకు పాల్పడటానికి కారణం ఏంటి అని వెతికితే అందరూ ఆశ్చర్య పోయే సమాధానాలు బయటికి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది ఎప్పుడో చనిపోయిన తల్లి పిలిచింది అంటూ ఓ గృహిణి ఏకంగా ఒక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య పాల్పడింది. ఘటన సంచలనం గా మారిపోయింది.  హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.


 కొత్తపేట పరిధి హుడా కాలనీలో నివాసముంటున్న విశ్వనాథరాజు వైశాలి లకు 2005లో వివాహం జరిగింది. విశ్వనాథ్ బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తూ ఉండగా వైశాలి ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. అయితే ఇటీవలే ఈ ఇంట్లోనే గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబం మొత్తం హ్యాపీ గానే ఉంది కానీ ఇలాంటి సమయంలో వైశాలి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అని అందరూ షాక్ అయ్యారు. అయితే వైశాలి డెడ్ బాడీ పక్కనే సూసైడ్ నోట్ లభించింది. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని అమ్మ పిలిచింది అందుకే వెళ్ళిపోతున్నాను అంటూ లేఖలో రాసి ఉంది వైశాలి. తల్లి కొన్ని రోజుల క్రితం మృతి చెందడంతో మనో వేదనకు గురైంది వైశాలి. అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: