పిల్లలకు చదువు చెప్పి ప్రయొజకులుగా మార్చవలసిన ఒక టీచర్ విద్యార్థుల పట్ల అసభ్యకరమైన ప్రవర్తన చేసాడు. అంతటితో ఆగక లైంగిక వేధింపులకు గురి చేసే వాడు. ఇలాంటి విషయాలను ఎవరికీ చెప్పుకోలేక విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ ఘటన తో పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఇంట్లో చెప్పుకొలెక వారిలో వారే మదన పడుతూ అలానే గడిపారు. చివరికి పై అధికారులకు ఫిర్యాదు చేయడం తో ఈ వ్యవహారం బయటకు పొక్కింది.
వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది. గుంటూరు జిల్లా గుంటూరులో జరిగింది.సత్తెనపల్లి పట్టణంలోని శాలివాహన నగర్ లో ఎంపిపిఎస్ పాఠశాల నడుస్తోంది. ఈ స్కూల్లో హుస్సెన్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.. అక్కడ తరగతి గదిలో పుస్తకాలకు బదులుగా నీలి చిత్రాలను చూపించి ఎక్కడేక్కడో చేతులు వేస్తూ నీచంగా మాట్లాడే వాడు..స్కూల్ అయ్యాకా కూడా వదిలే వాడు కాదని, ఫోన్లు చేసి మరి ఇబ్బంది పెడుతూనే ఉన్నాడని చెప్పారు.
స్కూల్ లో శిశు సంక్షేమ శాఖ పాఠశాల లో బాలల సంరక్షణ మీద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో అమ్మాయిలు వాళ్ళకు ఎదురైనా చేదు అనుభవాన్ని గురించి చెప్పారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాంతో పాటుగా సోషల్ మరియు సైన్స్ టీచర్లను అదుపులోకి తీసుకున్నారు.నిందితుడైన గణితం టీచర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. విద్యార్థినుల ఫిర్యాదులపై జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా బాలల సంరక్షణ అధికారి మహిళా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.ఇలాంటి ఘటనలు జరుగుతూ వుండగా పొలిసులు కేవలం చూసి చూడనట్లు వదిలెస్తున్నారు అని విధ్యార్థుల తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చెస్తున్నారు.. ఇలాంటి ఘటనలు వెలుగు లోకి రావడం తో పిల్లలను స్కూల్ కు పంపించాలి అంటే భయంతో వణికిపోతున్నారు. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు...