తండ్రి పాడు పని.. కళ్ళారా చూసిన కొడుకు.. చివరికి?
కానీ ఇటీవలి కాలంలో మాత్రం కొంత మంది తండ్రి ప్రేమకే కలంకం కలిగించే విధంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే తండ్రి మందలిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఓ తండ్రి తప్పు చేస్తుంటే సరిదిద్దాలని ప్రయత్నించాడు తనయుడు. తప్పు చేస్తున్నావ్ నాన్న తీరు మార్చుకుంటూ హెచ్చరించాడు. ఇంట్లో భార్య పిల్లలను పెట్టుకొని బయట పాడు పనులు చేయడం మంచిది కాదు అంటూ చెప్పాడు. ఇలా కొడుకు చెప్పింది తన మంచి కోసమే అని అర్థం చేసుకోకుండా ఏకంగా రక్తసంబంధం అని కూడా మర్చి దారుణంగా హత్య చేశాడు ఇక్కడ ఒక తండ్రి. ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం నగరంలో వెలుగులోకి వచ్చింది.హౌసింగ్ బోర్డు కాలనీలో మహబూబ్ బాషా నివాసం ఉంటున్నాడు.
న్యాయవాదిగా పనిచేస్తున్న ఇతనికి హుస్సేన్ అనే కుమారుడు ఉన్నాడు. కొడుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాడు మెహబూబ్ భాష. అయితే ఇటీవలే మహబూబ్ బాషా వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అన్న విషయం కొడుకు హుస్సేన్కు తెలిసింది. ఈ విషయంలో తండ్రిని హుస్సేన్ మందలించాడు. అయినప్పటికీ అతని తీరులో మాత్రం మార్పు రాలేదు. అయితే ఈ విషయాన్ని బంధువులతో చెప్పుకొని హుస్సేన్ తన బాధను వెలిబుచ్చిన విషయం చివరికి మెహబూబ్ భాషా చెవిలో పడడంతో కోపంతో ఊగిపోయాడు. ఇక తన కన్న కొడుకుని హతమార్చాలని భావించాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. తీవ్ర కోపోద్రిక్తిడిగా మారిపోయిన మహబూబ్ బాషా క్షణికావేశంలో కొడుకుపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఇలా ఒక వైపు కొడుకు సజీవదహనం అవుతుంటే తండ్రి రాక్షసానందం పొందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.