పెళ్లైన కొద్దిసేపటికే పెద్ద గొడవ.. కారణం ఏంటంటే..??
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా డోంగ్రీకి చెందిన అఖిలేష్ పరిహార్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. అంతేకాదు.. బాలికతో పారిపోయి ఏడాది క్రితం వివాహం కూడా చేసుకున్నాడు. ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. అబ్బాయి, అమ్మాయి ఇంటికి తిరిగి రాగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు.. బాలిక మైనర్ కావడంతో యువకుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.
అయితే గత 8 నెలలుగా అఖిలేష్ జైలులో ఉండటంతో ఆ అమ్మాయిని వేరే అబ్బాయితో రహస్యంగా పెళ్లి జరిపించాలని అనుకున్నారు. ఇక విషయం తెలుసుకున్న అఖిలేష్ కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకుని పెళ్లిని ఆపాలని డిమాండ్ చేయడంతో అతని మాటలు విని పెళ్లికూతురు సోదరుడు, అఖిలేష్ సోదరుల మధ్య గొడవ జరిగింది. అంతేకాదు... గుడి బయట ఇరువర్గాలు తన్నుకోవడం, కొట్టుకుంటున్న సమయంలోనే అప్పటికే పెళ్లి అయిపోయింది. కానీ వీరిద్దరి గొడవ ఆగలేదు.
ఇక గొడవల మధ్య భర్తతో కలసి కారు ఎక్కి వెళ్లిపోయింది వధువు. ఈ వివాదంపై అఖిలేష్ మేనమామ స్పందించారు. పెళ్ళికూతురికి అప్పటికే పెళ్లయిందని వెల్లడించారు. అలాంటి సమయంలో మొదటి పెళ్లి రద్దు చేసుకుని రెండో పెళ్లి అధికారికంగా చేసుకోవాలని ఆందోళనకు దిగారు.లేదా వారి అబ్బాయిని జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.