టాప్ సీక్రెట్ : గంజాయితో ఏమి చేస్తున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
కానీ ప్రణాళికలను పసిగట్టి.. గంజాయి నుంచి హాష్ ఆయిల్ తీసి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసారు. వీరి నుంచి రూ.25లక్షల విలువైన 3.5 లీటర్ల ప్యాకెట్ల గంజాయి నూనె స్వాధీనం చేసుకున్నట్టు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ మీడియాకు వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా నిందితులు సంపతి కిరణ్‌కుమార్, షేక్ కమల్, మహ్మద్ ఇర్పాన్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పాడేరు నుంచి వేర్వేరుగా నగరానికి గంజాయి, హాష్ ఆయిల్‌ను తీసుకువచ్చినట్టు తెలిపారు.
జహనుమాలో నివసించే మహ్మద్ ఇర్పాన్ హమాలీగా, యాప్రాల్ నివాసి షేక్ కమల్ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తుంటారు. అయితే మూడు నెలల క్రితం కమల్‌కు ఇర్ఫాన్ పరిచమయ్యాడు. నూతన సంవత్సరం వేడుకలలో గంజాయి గిరాకి బాగుంటుందని, ముఖ్యంగా విద్యార్థులు, యువతకు చేరవేద్దామని ప్లాన్ వేసారు. వీరిద్దరూ కలిసి గత నెల నవంబర్‌లో పాడేరు వద్దకు వెళ్లారు. గంజాయి సరఫరా దారుడు గౌతమ్‌ను పరిచయం చేసుకుని.. సుమారు 2 లీటర్ల హాష్ ఆయిల్‌ను తీసుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం ఒక్కొక్క సంచిని రూ1000కి విక్రయించేందుకు ప్రయత్నించారు. ఈ తరుణంలోనే సౌత్ జోన్ పోలీసులు ఫలక్‌నుమా వద్ద ఇర్ఫాన్, కమల్‌లను అదుపులోకి తీసుకున్నారు.