పసికందును చంపిన తల్లి.. అందుకోసమేనా..?
సదరు మహిళ వంట గదిలో పని చేసే ఆశ్రమాన్ని నడుపుతోంది. తండ్రి జోజిథామస్ ఇచ్చిన వాంగ్మూలం ఆదారంగానే పోలీసులు కేసు నమోదు చేసారు డిసెంబర్ 10ననిర్వహించిన పోస్టుమార్టం తరువాత .. పోలీస్ అధికారి సర్జన్తో మాట్లాడి.. పిల్లవాడి తల వెనుక భాగంలో గాయాలున్నాయని కనుక్కొన్నారు. శిశువు సన్నని పుర్రె కారణంగా గాయం కనిపించలేదని పోలీసులు వెల్లడించారు. ఆ అధికారి పిల్లల తల్లిదండ్రులను కలుసుకుని వారిని కూడా ప్రశ్నించినట్టు వెల్లడించారు. మహిళా కొంత మానసికంఆ ఇబ్బంది పడుతుండడంతో పోలీసులు మాత్రం వివరాలను సరిగ్గా తెలుసుకోలేకపోయామని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఆ మహిళ గురించి ఆరాతీయగా సదరు మహిళ ఓ వ్యక్తితో ఫోన్లో కలుసుకున్నారని, ఆశ్రమంలో కలిసి జీవించడం ప్రారంభించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. తండ్రికి అప్పటికే పెళ్లి జరిగిందని.. ఆ మహిళ అతనితో సహజీవనం చేస్తుందనే విషయం వెలుగులోకి వచ్చినది. ఈ విచారణలో కన్న తల్లినే బిడ్డను హత్య చేసిందని తేలడంతో పోలీసులు ఆ తల్లిని అరెస్ట్ చేసారు. అయితే మరొవైపు కొట్టాయంలోని ఓ ప్రయివేటు ఇన్స్టిట్యూట్ లో ఆ మహిళ చదువుతుందని.. ఫోన్లో ప్రేమికుడితో సంభాషించారని.. అనంతరం కలిసారని, ఆ పసిపాప తన చదువకు హాని కలిగిస్తుందనే బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నట్టు పోలీసులు తెలిపారు.