అతితెలివి దొంగను పట్టించింది.. ఎలాగంటే?
ఇక్కడ ఓ దొంగ చోరీల లో ఆరి తేరిపోయాడు. ఇంట్లోకి చొరబడటం విలువైన వస్తువులు దొంగలించడం కాదు.. అతని టార్గెట్ కేవలం విలువైన సెల్ ఫోన్స్ మాత్రమే. విలువైన మొబైల్ కనిపించింది అంటే చాలు చేతివాటం చూపిస్తూ ఉంటాడు. ఇటీవలే తాడేపల్లి రూరల్ పరిధిలోని అమరావతి కరకట్ట వెంబడి కృష్ణా నది ఒడ్డున స్నానాలు ఆచరించేందుకు వెళ్లిన విద్యార్థులు తమ సెల్ఫోన్లను ఒక బ్యాగులో పెట్టి స్నానం కి వెళ్లిన సమయంలో మొబైల్స్ అపహారణకు గురయ్యాయి. దీనిపై ఇక విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే గుంటూరు కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న 23 మంది విద్యార్థులు ఇటీవలే కరకట్ట వెంబడి ఉన్న గంగరాజు ఫాం హౌస్ వైపు స్నానాలు ఆచరించేందుకు వెళ్లారు.
అందరు విద్యార్థుల మొబైల్స్ ఒక బ్యాగ్ లో పెట్టి వెళ్లారు. ఇక స్నానాలు తర్వాత వచ్చి చూడగా ఫోన్లు కనిపించలేదు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఇక మొబైల్స్ పోయిన గంటల్లోనే ఆ సెల్ ఫోన్స్ ఓఎల్ఎక్స్ లో దర్శనమిచ్చాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. ఇక మొబైల్స్ కొనేందుకు దామోదరం అనే వ్యక్తి ని సంప్రదించారు. మొబైల్ డెలివరీ చేసేందుకు రాక అతని వద్ద మరో 22 మొబైల్స్ ఉన్నాయని గ్రహించి అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. అయితే దామోదరం చదివింది ఇంటర్మీడియట్ మాత్రమే. కానీ మనసులో మాత్రం బాగా పట్టు సంపాదించాడు. సెల్ ఫోన్లు దొంగలించి ఓఎల్ఎక్స్ లో అమ్ముతూ ఉంటాడు.. లాప్టాప్ ఉపయోగించి కేవలం సెకన్లలోనే దొంగిలించిన ఫోన్ లాక్ తీస్తూ ఉంటాడు. ఇప్పుడు అతని అతితెలివి పోలీసులకు పట్టించింది.