ప్రేమ పెళ్లి.. భార్య గర్భం పై అనుమానం.. చివరికి?

praveen
నేటి రోజుల్లో వివాహబంధం అన్నది ఎన్నో దారుణాలకు కారణమవుతుంది. రోజురోజుకీ వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఏకంగా కష్ట సుఖాల్లో తోడు ఉంటానని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న వారే దారుణంగా కట్టుకున్న వారి ప్రాణాలు తీస్తున్న ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. ఒకే వీధిలో  ఉండే ఇద్దరి చూపులు కలిసాయి. మనుషులు ముడిపడ్డాయి. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే పెళ్లికి ముందే ఆ మహిళ గర్భం దాల్చింది. ఆ తర్వాత వీరికి పెళ్లి అయింది. పెళ్లి అయిన కొన్ని నెలల తర్వాత ఆడబిడ్డకు జన్మనిచ్చింది సదరు మహిళ.

 కానీ అంతలోనే భర్త అసలు రంగు బయటపడింది. నువ్వు లేకుండా బ్రతకలేను నువ్వే సర్వస్వం అంటూ మాటలు చెప్పిన భర్త చివరికి ఆడపిల్ల పుట్టిందని కారణంతోనో లేదా డబ్బు వ్యామోహం తోనో చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. బిడ్డ నాకే పుట్టింది అన్న గ్యారెంటీ ఏంటి అంటూ ప్రశ్నించాడు.. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇలా మాట్లాడటంతో అందరూ అవాక్కయ్యారు. ఇలా వేధిస్తూ కొద్దిరోజులకే భార్యను వదిలించుకున్నా ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. అన్నా నగర్ ప్రాంతంలో ఉండే జ్ఞాన శేఖర్, దివ్య మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి పోయింది.

 ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఇక ఈ క్రమంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు  వీరి ప్రేమకు గుర్తుగా ఒక బిడ్డ కూడా పుట్టింది. కానీ ఆ తర్వాత జ్ఞాన శేఖర్ అసలు రంగు బయట పెట్టాడు. పుట్టిన బిడ్డకు తనకు సంబంధం లేదు అంటూ చెప్పాడు. దీంతో సదరు మహిళ అవాక్కయ్యింది. ఇలాంటి సమయంలో ఇక పుట్టింటివారు బంధువులు సదరు యువతికి అండగా నిలిచారు. అయితే తనను వదిలించుకొని మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడని తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది దివ్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: