శిక్ష‌ణ‌ కోసం వచ్చిన బాలికతో కోచ్‌ అసభ్యకర ప్రవర్తన

N ANJANEYULU
క్రికెట్ శిక్ష‌ణ కోసం త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఓ మైన‌ర్ బాలిక‌పై క‌న్నేశాడు కోచ్‌. త‌రుచూ ఏదో ఒక సంద‌ర్భంలో ఆ అమ్మాయి శ‌రీర భాగాల‌ను తాక‌డానికి ప్ర‌య‌త్నిస్తుండేవాడు. అస‌భ్యక‌రంగా ప్ర‌వ‌ర్తించేవాడు. లైంగికంగా కూడ వేధించాడు. ప‌లుమార్లు చెప్పినా ప‌ద్ద‌తి మార్చుకోలేదు. చివ‌ర‌కు ఆ బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. పోలీసులు విచార‌న చేప‌ట్టి కోచ్‌తో పాటు క్రికెట్ అసోసియేష‌న్ ఆఫ్ పాండిచ్చేరి కి చెందిన ఐదుగురు ప్ర‌తినిధులపై ఫోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.
వివ‌రాల్లోకి వెళ్లితే.. పుదుచ్చేరికి చెందిన సీనియ‌ర్ ఆట‌గాడు, కోచ్ త‌మ‌రైక‌న్న‌న్‌. అత‌ని వ‌ద్ద ఓ మైన‌ర్ బాలిక క్రికెట్ శిక్ష‌ణ కోసం చేరింది. చేరిన కొద్ది రోజుల‌కే కోచ్ అసభ్యంగా తాకేవాడ‌ని, లైంగికంగా వేధించేవాడ‌ని బాలిక వివ‌రించింది. తాను నిన్ను ప్రేమిస్తున్నాన‌ని త‌మ‌రైక‌న్న‌న్ సందేశాన్ని బాలిక‌ మొబైల్‌కు పంపాడు.  నా ప్రేమ‌ను అంగీక‌రించ‌కుంటే కోచింగ్ కూడ ఇవ్వ‌ను అని ఆ బాలిక ను ప‌లుమార్లు బెదిరించాడు. బాలిక శ‌రీర భాగాల‌ను ఏదో ఒక వంక‌తో తాకుతూ అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించేవాడని బాలిక పేర్కొన్న‌ది. ప‌లుమార్లు చెప్పినా విన‌లేదు. పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తున్నానని తెలిసి అత‌ని భార్య‌తో క‌లిసి మా ఇంటికి వ‌చ్చాడు అని బాలిక వివ‌రించింది. పోలీసుల వ‌ద్దకు వెళ్ల‌వ‌ద్ద‌ని ప్రాధేయ‌పడ్డారు. వారి మాట‌లు విన‌కుండా త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్టు బాలిక వెల్ల‌డించింది.
చైల్డ్ లైన్ ద్వారా పోలీసుల‌ను ఆశ్ర‌యించానని బాధితురాలు త‌మ గోడును వెల్ల‌బోసుకుంది. బాలిక ఫిర్యాదును స్వీక‌రించిన పోలీసులు విచార‌ణ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ విచార‌ణ‌లో కోచ్ తో పాటు నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన ఐదుగురు సీఏపీ ప్ర‌తినిధుల‌పై కూడ ఫోక్సో చ‌ట్టం కింద కేసులు న‌మోదు చేశారు పోలీసులు.  ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌రుచూ దేశంలో ఎక్క‌డో ఒక చోట జ‌రుగుతూనే ఉన్నాయి. మ‌హిళ‌లు, అమ్మాయిలు అని తేడా లేకుండా ప్ర‌తినిత్యం వేధింపుల‌కు గుర‌వుతూనే ఉన్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌హిళ‌ల కోసం ఎన్ని చ‌ట్టాలు తీసుకొచ్చిన అవి ఆచ‌ర‌ణ‌కు మాత్రం నోచుకోవ‌డం లేదు.  లైంగికంగా వేదించేవారికి ఇత‌ర దేశాల మాదిరిగా భార‌త‌దేశంలో కూడ  వెంట‌నే శిక్ష వేయాల‌ని సోష‌ల్ మీడియాలో ప‌లువురు కోరుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: