డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్.. మందుబాబులు ఊహించని ట్విస్ట్?

praveen
ఇటీవలి కాలంలో రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారుల పట్ల అటు పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఒకసారి ట్రాఫిక్ పోలీసులకు చిక్కారు అంటే చాలు ఇక భారీ జరిమానాలు విధిస్తున్నారు.  ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడిపారు అంటే చాలు ట్రాఫిక్ పోలీసులు ఊహించని శిక్షలు విధిస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇటీవల కాలంలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఈ క్రమంలోనే ఎక్కడపడితే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేస్తూ వాహనదారులకు షాక్ ఇస్తున్నారు. దీంతో ఒకప్పుడు తాగి బండి నడిపి ప్రమాదాలకు గురయ్యే వాహనదారులు ఇక ఇప్పుడు ఎక్కడికక్కడ పోలీసులు నిఘా ఏర్పాటు చేయడంతో తాగి వాహనం నడవాలంటే భయపడిపోతున్నారు. అయితే ఇక్కడ పోలీసులు  తాగి వాహనాలు నడిపే వారిని కంట్రోల్ చేసేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహించారు కానీ ఇంతలో పోలీసులకు ఊహించని షాక్ తగిలింది.

 సాధారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎలా చేస్తారు. బ్రీత్ అనలైజర్ యంత్రాన్ని వాహనదారుడి నోటి దగ్గర పెట్టి మద్యం తాగాడా లేదా అన్న విషయాన్ని చెక్ చేస్తూ ఉంటారు. అయితే ఇటీవలే హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ దగ్గర రాత్రి సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఇలా బ్రీత్ ఎనలైజర్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. అంతలో అక్కడికి ఒక ద్విచక్ర వాహనం వచ్చింది. ఆ వాహనంపై ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక వారిని చూస్తే కాస్త తేడా కొట్టడంతో పోలీసులు బ్రీత్ అనలైజర్ పెట్టారు కానీ అంతలోనే ఒక వ్యక్తి ఆ బ్రీత్ అనలైజర్ లాక్కొని వెళ్ళిపోయాడు. అయితే పోలీసులు అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా దొరకలేదు. ఇక ఆకతాయి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: