ప్రాణం తీసిన వినాయక చవితి వేడుకలు.. తస్మాత్ జాగ్రత్త?

praveen
సాధారణంగా వినాయక చవితి వచ్చింది అంటే హడా విడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా వినాయకచవితిని ఎంతో ఘనంగా జరుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక వినాయక చవితి జరుపుకునే ప్రతి రోజు కూడా ఎంతో  అద్భుతం గా ఎంజాయ్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అదే సమయంలో అటూ వినాయక చవితి వేడుకల్లో కొన్ని కొన్ని సార్లు అపశృతి  చోటు చేసుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది.

 ఏకంగా యువకుల మధ్య ఘర్షణ తలెత్తడం చిన్నపాటి ఘర్షణ పెద్ద గొడవకు దారి తీయడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. అందుకే వినాయక చవితి వేడుకలు జరుపుకునే టప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలి అని సూచిస్తూ ఉంటారు. పోలీసులు ఇటీవల ఏకంగా వినాయక చవితి వేడుకలు ఒకరి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యాయి.  ఎంతో సంతోషంగా జరుగుతున్న వేడుకల్లో అపశృతి అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఇలా ఇటీవలే హైదరాబాద్ నగరంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో హింస చోటుచేసుకుంది  ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ ఏకంగా ఒక ప్రాణం పోయేంతవరకు దారితీసింది.

 ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ  ఇరువర్గాల గొడవగా మారడంతో దారుణమైన హింసకు దారి తీసింది  శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ గడి మలక్పేట్ ఏరియా ఆఫీస్ లో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరు వర్గాలు కూడా బాహాబాహీకి దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ఒక వర్గం లోని ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు లక్ష్మీనారాయణ గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: