తనకంటే పదేండ్ల చిన్నవాడితో శృంగారం.. చివరికి..?

MOHAN BABU
 ప్రస్తుత కాలంలో  వావివరుసలు మసకబారి పోతున్నాయి. వయసు భేదాలు కూడా లేకుండా పోతున్నాయి. ప్రేమ గుడ్డిది అంటే ఏమో అనుకున్నాం. కానీ కొన్ని ఇలాంటి సంఘటనలు చూస్తే ప్రేమ గుడ్డిది అని అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ప్రేమ అనేది  ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా పుడుతుందో అర్థం కాదు. దీనికి కులము మతము, వయస్సు అనే తేడా లేకుండా ఉంటుంది. అలాంటి ఒక సంఘటన ఇది. విషయం ఏమిటంటే   చాలా చిన్న వయస్సు ఉన్న వ్యక్తితో ప్రేమలో పడింది ఓ వివాహిత. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ కలిసి ఒకటి అయిపోయి సహజీవనం కూడా ప్రారంభించారు. తన కంటే దాదాపు చిన్న వయసులో ఉన్న వ్యక్తితో తన ప్రేమాయణం మొదలు పెట్టింది.   అతనితో  శృంగారం కూడా చేయడం స్టార్ట్ చేసింది. ఈ సమయంలోనే ఆ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అసలు  ఏం జరిగింది..?

  కర్ణాటక రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా పెన్ నగరం సమీపంలోని నరసాపురం గ్రామానికి చెందినటువంటి ప్రకాష్ , లక్ష్మీ లు దంపతులు. లక్ష్మికి 38 సంవత్సరాల వయస్సు. వీరిరువురు కర్ణాటక రాష్ట్రంలోని బల్ ఊరులో ఒక హోటల్ నడిపిస్తున్నారు. తరచుగా వీరు హోటల్ కు వచ్చే అటువంటి  కోట మండలం ఎలాశెట్టి గ్రామానికి చెందిన సెల్వరాజ్ 28 సంవత్సరాలు  అనే వ్యక్తితో లక్ష్మి కాస్త పరిచయం ఏర్పడినది.ఆ యొక్క పరిచయమే ప్రేమ యానంగా మారింది. తనకంటే 10 సంవత్సరాల వయసులో చిన్నవాడైనా ఆ యువకుడితో ఈ మహిళ ప్రేమలో పడిపోయింది. ఇది కాస్త ఎక్కువైపోయి ఇద్దరు కలిసి, సన్నిహితంగా కలవడం కూడా మొదలు పెట్టారు.

ఏకంగా ఒక రోజు ఇద్దరు పారిపోయి  హోసూరు దగ్గరలోని బొమ్మ పల్లిలో వేరే కాపురం కూడా పెట్టేసారు. అప్పటి నుంచి కొద్ది రోజులు బాగానే ఉన్నారు. తర్వాత వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ సెల్వరాజ్  అనే యువకుడు తరచుగా లక్ష్మితో గొడవపడేవాడు. దీంతో మనస్థాపం చెందినటువంటి లక్ష్మి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: