కన్న కూతురిని బలిచ్చిన తండ్రి.. ఎందుకంటే..??
అయితే పోలీసులు రంగంలోకి దిగిన చుట్టుపక్కల అంతా వెతికారంట. ఇక ఎక్కడా పాప ఆచూకీ కనిపించలేదు. కాగా.. చివరకు మంగళవారం ఉదయం ఓ నది పక్కన పాప మృతదేహం లభ్యమైంది. అంతేకాక.. అక్కడ తాంత్రిక పూజలు చేసినట్లుగా ఆనవాళ్లను గుర్తించారు. అయితే పాపను నరబలి ఇచ్చినట్లుగా భావించిన పోలీసులు.. అనుమానమున్న ప్రతి ఒక్కరినీ అడిగారు. ఇక పాప తండ్రి, పూజారి కలిసి ఆమెను హత్య చేసినట్లుగా నిర్ధాణకు వచ్చారు పోలీసులు.
పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొన తమదైన శైలిలో విచారించగా.. నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అయితే పాపను ఎందుకు చంపారో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఇక పూజారికి ఉన్న రోగం తగ్గేందుకే పాపను నరబలి ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా.. పాప తండ్రి, ఆ పూజారి గతంలో సఫారి గార్డెన్‌లో పనిచేశారు. అంతేకాక.. పూజారి ఇంట్లో చేదోడు వాదోడుగా ఉండేవారు. ఇక వారిద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవారు. అయితే కొన్ని నెలలుగా పూజారి ఆరోగ్యం పాడైపోయింది. ఇక అతడిని ఎక్కడ చూపించినా తగ్గలేదంట.
అయితే అది మందులకు తగ్గే వ్యాధి కాదని..నరబలి ఇవ్వాలని ఓ వ్యక్తి సలహా ఇచ్చారు. కాగా.. అప్పటి నుంచి నరబలి కోసం ప్రయత్నాలు చేశారు. చివరికి స్నేహితుడి పాపను బలి ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. ఈ తరుణంలోనే ఆదివారం రాత్రి నానమ్మ వద్ద నిద్రపోతున్న చిన్నారిని పక్కా పథకం ప్రకారం కిడ్నాప్ చేసి.. అనంతరం నదీ ఒడ్డుకు తీసుకెళ్లి క్షుద్రపూజలు చేసి పాపను హత్య చేశారు.