నైజీరియన్ల నయాదందా.. తియ్యగా మాటలు కలుపుతూ?

praveen
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా మోసగాళ్ల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది.  ఏదో ఒక విధంగా జనాలకు మాయ మాటలు చెప్పడం ఆ తర్వాత భారీగా డబ్బులు దండుకోవడం లాంటివి చేస్తున్నారు ఎంతో మంది. రోజూ రోజుకు ఇలాంటి తరహా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఒక నయా దందా ఇటీవలే వెలుగులోకి వచ్చి అందరికీ షాక్ ఇస్తోంది. కరోనా వైరస్ తగ్గించే మూలికలు, సంతాన సాఫల్యం పెంచే ఔషదాలు.. ఇలా ఎన్నో రకాల ఆయుర్వేద ఔషధాలు తమ దగ్గర ఉన్నాయి అంటూ ఇటీవల నైజీరియన్లు కొత్త దందాకు తెరలేపారు. ఈ క్రమంలోనే ఎంతోమంది ని టార్గెట్ చేస్తూ మాయ మాటలతో నమ్మించి భారీగా డబ్బులు దండుకోవడం లాంటివి మొదలుపెట్టారు.




 భారత్తో పాటు ఇంగ్లాండ్ అమెరికాలో ఉంటున్న భారత వైద్య నిపుణులు ఆయుర్వేద వైద్య నిపుణులు వ్యాపారులతో ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకుని వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మరి ఏకంగా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది జనాలు  ఈ మోసగాళ్ళు బారినపడి భారీగా డబ్బులు కోల్పోయారు. హైదరాబాద్కు చెందిన చంద్రశేఖర్ అనే డాక్టర్ ఏకంగా ఈ మోసగాళ్ళు బారినపడి 11.30 కోట్లు మోసపోయాడు.



 అంతేకాకుండా అందమైన అమ్మాయిల ఫోటోలతో ఫేస్బుక్ ఖాతాలు ఓపెన్ చేసి ఇక ఆ ఖాతాలతో ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపించి అవతలి వ్యక్తి అంగీకరించగానే మాయ మాటలు చెప్పడం మొదలు పెడుతున్నారు. అమ్మాయిలాగా మాట్లాడుతూ ఎంతోమందిని నమ్మిస్తున్నారు. చివరికి వాట్సాప్ నెంబర్ సాధించి ఇక మాటలతో మభ్యపెట్టి పూర్తి వివరాలు తెలుసుకుని ఇక మోసానికి పాల్పడుతున్నారు. ఇలా మధ్యప్రదేశ్ లో లభించే ఆయుర్వేద మూలికలను అమ్ముతాం అంటూ పుణేకు చెందిన ఒక ఆయుర్వేద వైద్యురాలి దగ్గర  నుంచి 4.90 కోట్లు.. బెంగళూరుకు చెందిన విశ్రాంత అధికారి దగ్గర్నుంచి  3.9 కోట్లు బదిలీ చేయించుకుని టోకర వేశారు. ఇక దీని పై దృష్టిసారించిన పోలీసులు ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు  చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: