అతనికి 19, ఆమెకు 9.. చివరికి ఏం జరిగిందంటే ?

praveen
నేటి సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. కామంతో కళ్లు మూసుకుపోయి తాము మనుషులమే అన్న విషయాన్ని మరిచిపోతున్నారు  మానవ మృగాలు లాగా దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. రోజురోజుకు ఇలాంటి తరహా ఘటనలు అటు మహిళల జీవితాన్నే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ముఖ్యంగా సొంత వారి నుంచి వేధింపులు ఎదుర్కొనే  సభ్య సమాజంలో నేడు మహిళలు బ్రతుకుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  ఎంతోమంది వావి వరసలు మరిచి మహిళలపై దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 అతని వయస్సు 19 ఏళ్లు.. బాలిక వయస్సు తొమ్మిదేళ్లు.. అయితే అతను ఆ బాలికకు బాబాయి వరస అవుతాడు. తను పై పోర్షన్లో  ఉంటే బాలిక కింది పోర్షన్ లో ఉంటుంది. అయితే ఇక బాబాయి లాగా వ్యవహరించాల్సిన యువకుడు కామం తో ఊగిపోయాడు. అభం శుభం తెలియని ఆ తొమ్మిదేళ్ల చిన్నారిపై కామవాంఛను తీర్చుకోవడానికి  ఎన్నో రోజుల నుంచి సమయం కోసం ఎదురు చూశాడు. చివరికి ఓ రోజు సమయం చూసి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇక ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది  బోయిగూడ ప్రాంతానికి చెందిన షారుక్ ఖాన్ అనే 19 ఏళ్ల యువకుడు స్థానికంగా ఉన్న కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు  అయితే కింద పోర్షన్ లో ఇక సదరు యువకుడికి అన్నయ్య వరస అయ్యే వ్యక్తి తన కూతురు భార్యతో కలిసి నివాసముంటున్నాడు.



 తెలిసిన అబ్బాయి కావడంతో కుటుంబ సభ్యులు షారుక్ ఖాన్ తో తరచూ మాట్లాడుతూనే ఉండేవారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు షారుక్ ఖాన్ ఇక కింది పోర్షన్ లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూండేవాడు. ఈ క్రమంలోనే ఆ ఇంట్లో ఉన్న 9 ఏళ్ల బాలిక పై కన్నేశాడు. సమయం కోసం ఎదురు చూశాడు. అయితే ఇటీవలే తల్లిదండ్రులు ఏదో పని మీద బయటకు వెళ్ళగా.. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. తమ కూతురు భయపడకుండా జాగ్రత్తగా చూసుకోవాలని షారుక్ ఖాన్ కు చెప్పి వెళ్లారు తల్లిదండ్రులు. ఆ తర్వాత ఇక బాలికకు మాయమాటలు చెప్పి గదిలోకి తీసుకెళ్లాడు. ఇక అతని విచిత్ర ప్రవర్తన చూసి ఒక్క సారిగా భయపడింది బాలిక. కానీ డబ్బులు ఇస్తాను అంటూ చెప్పి ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక జరిగిన విషయం చెప్పింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని  అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: