ఈ మధ్యకాలంలో సైకో దాడులు ఎక్కువ అవుతున్నాయి. సైకో అమ్మాయిల్ని ఎత్తుకుపోయాడు. సైకో వారిని కొట్టాడు. సైకో మనుషుల్ని తింటున్నాడు. సైకో ఇంట్లో చొర బడ్డాడు. ఇలా దేశవ్యాప్తంగా పలు రకాల వార్తలు వింటూనే ఉన్నాం. అలాంటి సైకో చేసిన ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. వివరాలు ఏంటో తెలుసుకుందాం. సొంత చిన్నాన్న సైకో గా మారిపోయాడు. చక్కగా ఆడుకుంటున్న వదిన కొడుకులను హతమార్చలనుకున్నాడు.
విచక్షణ రహితంగా కనీస కనికరం లేకుండా చిన్నారులను దారుణంగా కొట్టి చంపేయడం గుంటూరు జిల్లాలోనే కలకలం గా మారింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలోనే జరిగింది. వదిన కొడుకులను కిరాతకంగా కట్టెలతో కొట్టి చంపాడో సైకో. అభం శుభం తెలియని చిన్నారులను దారుణంగా హత్య చేశాడు అనంతరం పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు సైకో. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చేబ్రోలు మండలం వెంచర్ల గ్రామానికి చెందిన కోటేశ్వరరావు రేపల్లె కు చెందిన ఉమాదేవితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు పార్థివ్ సహసవత్ పది సంవత్సరాలు, రోహిత్ తశ్విన్ 8 సంవత్సరాలు ఉంటారు. కోటేశ్వరరావు బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. లాక్ డౌన్ కారణంగా సొంతూరికి వచ్చేసారు.
అయితే రమాదేవి తన ఇద్దరు పిల్లలతో తన పుట్టింటికి వెళ్ళింది. తన పుట్టింటి దగ్గర మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన ఉమాదేవి చెల్లెలి భర్త కాటూరి శ్రీనివాసరావు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆడుకుంటున్న ఇద్దరు పిల్లలను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేసి దారుణంగా కొట్టి చంపేశాడు. చెక్క మొద్దులతో దాడి చేసి విచక్షణ రహితంగా కిరాతకంగా హతమార్చారు. అనంతరం పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు.
సైకో అభం శుభం తెలియని చిన్నపిల్లలను కొట్టి చంపడం స్థానికంగా కలకలం రేపింది. శ్రీనివాస రావుకి చాలాకాలంగా మతిస్థిమితం లేదని ఆయన మందులు కూడా వాడుతున్నట్లు అత్త విజయలక్ష్మి చెబుతున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. చిన్నారుల మృతదేహాలను రేపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.