ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. శోభనం రోజు రాత్రి..

Satvika
ప్రేమించిన వాళ్ళు ఈ మధ్య పెద్దలను ఎదురించి వివాహం చేసుకుంటున్నారు. కొందరు మాత్రం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. అయితే కొన్ని పెళ్లిళ్లు మాత్రం సాఫీగా సాగిపోతున్నాయి. మరికొన్ని మాత్రం అనుకోకుండా ముగిసిపోతున్నాయి. అలాంటి ఘటనే ఇప్పుడు ఎదురైంది. ప్రేమించి ,పెద్దల ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ, శోభనం రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ, ఉదయానికి ఇద్దరు కూడా అపాస్మారక స్థితిలో పడిఉన్నారు.


ఆ రాత్రి ఏం జరిగింది అనే వీచయాన్ని పోలీసులు దర్యాప్తు  చేస్తే ఇద్దరు కలిసి విషం తీసుకున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా అనేక ఆలోచనలకు  తెర తీస్తుంది. ఈ ఘటన బిహార్‌ లోని సోనేట్ పోలీస్ స్టేషన్ పరిధి లో చోటుచేసుకుంది. జమ్‌షెడ్‌పూర్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల శాంతీ దేవి, గోపాల్‌గంజ్ నగరంలోని మిర్జ్‌గంజ్‌కు చెందిన 30 ఏళ్ల ముకేష్ కుమార్ సింగ్ లు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు.


ఇద్దరు పెద్దలను ఒప్పించి ఓ గుడి లో పెళ్లి చేసుకున్నారు. వారికీ సాంప్రదాయబద్దంగా అన్ని చేయించారు. తర్వాత రోజు రాత్రి శోభనం జరిపించడానికి ముహుర్తాన్ని కూడా పెట్టారు. రాత్రి అంతా బాగానే జరిగింది. గదిలోకి ఇద్దరినీ పంపించారు. తెల్ల వారుజామున నిద్ర లేపేందుకు వెళ్లిన కుటుంబ సభ్యుల కు అపస్మారక స్థితి లో కనిపించారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు వారికి పాయిజన్ అయ్యిందని, ప్రస్తుతం విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గదిలో పక్కనే రాత్రి చికెన్ కలుపుకొని తిన్న అన్నం ఉంది. ఈ విషయంలో పోలీసులు దర్యాప్తును  వేగవంతం చేశారు. ఎందుకు సూసైడ్ చేసుకున్నారు. బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: