ఛీ.. ఛీ.. కరోనా మృతదేహాలను కూడా వదలడం లేదు..
కరోనాతో మృతి చెందిన వృద్ధురాలి మృతదేహంపై బంగారు ఆభరణాలను తీసి ఇచ్చిన వ్యక్తికి రూ.14వేలు చెల్లించారు కుటుంబ సభ్యులు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసరదాయరకు చెందిన వృద్ధురాలు కరోనా తో మరణించింది.అయితే, ఆమె మృతదేహంపై ఉన్న ఆభరణాల ను తీసేందుకు కుటుంబ సభ్యులు భయపడ్డారు. లక్షల విలువైన బంగారు ఆభరణాలు తీసుకునేందుకు ముందుకు రాలేదు. కరోనా మృత దేహాన్ని ముట్టుకుంటే వైరస్ సోకుతుందనే భయం తో ఎవరూ ధైర్యం చేయలేదు. చివరికి ఓ వ్యక్తి తో ఒప్పందం చేసుకున్నారు.
వృద్ధురాలి మృతదేహం పై బంగారాన్ని తీసి ఇస్తే.. రూ.14వేలు ఇస్తామని అతడి తో ఒప్పందం చేసుకున్నారు. అతడు డబ్బులు వస్తున్నాయి కదా అని మృత దేహం పై ఉన్న వస్తువుల ను ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఇక శవాన్ని స్మశానానికి తీసుకొచ్చారు.. ఈ క్రమం లో శవం పై రూ.లక్షకు పైగా బంగారం ఆభరణాలు, వెండి ఉన్నాయి. ఆభరణాలను అతడు తీసి కుటుంబ సభ్యులకు అందజేశాడు. దాంతో అతడికి రూ.14వేలు ముట్ట జెప్పారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో శవాలను మాయం చేసిన కూడా ఆశ్చర్య పడాల్సిన పని లేదు.. ఇలా చాలా మంది ప్రాణాల కన్నా కూడా డబ్బే ముఖ్యం అని బ్రతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల ను ఇంకెన్ని చూడాలో..