మైనర్ బాలికకు కడుపు చేసి గర్భం తీయించిన నీచుడు.. చివరికి ఎలా పట్టుబడ్డాడంటే..

Suma Kallamadi
కామాంధులు మైనర్ ఆడపిల్లలపై తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. అభం శుభం తెలియని బాలికలకు మాయమాటలు చెప్పి తమ వలలో వేసుకొని లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఒంగోలు జిల్లాలో కూడా ఇదే జరిగింది. ఒక కామాంధుడు ఓ 14 ఏళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి.. బాలికను తన ఇంటికి పిలిపించుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుందని.. నిందితుడు గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించాడు. అయితే బాలిక తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో తల్లిదండ్రులు ఆసుపత్రిలో చూపించారు. దీంతో అసలు విషయం తెలియడంతో బాధితురాలి తండ్రి మంగళవారం రోజు జిల్లా అదనపు ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.


బాధితుల ఫిర్యాదు ప్రకారం.. కొమరోలు మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక కేజీబీవీలో చదువుతోంది. ఐతే కరోనా సెలవలు కావడం తో బాలిక ఇంటి వద్దే ఉంటుంది. కాగా, అదే గ్రామానికి చెందిన కాశీరావు అనే ఓ వ్యక్తి బాలికను ఓ మహిళ సాయంతో ఇంటికి పిలిపించుకొని లైంగిక దాడికి పాల్పడాడు. ఫలితం గా ఆ బాలిక 6 నెలల గర్భం దాల్చింది. దీనితో సదురు కామాంధుడు విశ్వరూపం అనే మరో వ్యక్తిని కలిసి సుభానీ అనే ఆర్‌ఎంపీ వద్ద బాలికకు అబార్షన్ చేయించాడు. అబార్షన్ అనంతరం ఆ బాలిక యొక్క ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించింది.


ఈ విషయాన్ని గమనించిన బాలిక తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఈ క్రమంలోనే బాలికకు అబార్షన్ చేశారనే విషయం తెలిసింది. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన తల్లిదండ్రులు బాలికను నిలదీయడంతో ఆమె అసలు విషయం వెల్లడించింది. దీంతో ఆ జిల్లా ఎస్పీ ని ఆశ్రయించి నిందితులు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని.. తమకు రక్షణ కల్పించడంతోపాటు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అదనపు జిల్లా ఎస్పీ చట్టప్రకారం నిందితుడిపై చర్యలు తీసుకోవాలని మార్కాపురం డిఎస్పీ కి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: