ఎంఎంఐ నేత ఆధ్వర్యంలో రేవ్ పార్టీ...
సోమవారం రాత్రి హైదరాబాద్ చాంద్రాయణగుట్ట లో ఎంఐఎం కార్యకర్తల రేవ్ పార్టీ సంచలనం రేపింది. మజ్లీస్ నేత పర్వేజ్, అతని స్నేహితులు ఈ పార్టీని నిర్వహించినట్లుగా పోలీసులకు ప్రాథమికంగా లభించిన ఆధారాల్లో వెల్లడైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ప్రైవేట్ గదిలో ఈ పార్టీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రానికి చెందిన యువతులతో ఎంఐఎం కార్యకర్తలు అశ్లీల నృత్యాలు చేస్తూ కనిపించారు. మద్యం మత్తులో యువతులతో చిందేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పార్టీలో ఎంఐఎం కార్యకర్తలతో పాటు పలువురు యువతులు కూడా పాల్గొన్నారు.
అశ్లీల నృత్యాలు చేసే యువతులకు ఒక్కొక్కరికి రూ. 3 వేల నుంచి రూ. 10వేల వరకు చెల్లిస్తున్నారు. కొన్నిసార్లు యువతులతో ఏకాంతంగా గడిపే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.పబ్బులు, స్టార్ హోటళ్లలో...రెండేళ్ల కిందట వరకు హైదరాబాద్‌లోని పబ్బులు, స్టార్ హోటళ్లలోనే ఎక్కువగా రేవ్, ముజ్రా పార్టీలు జరిగేవి. గతేడాది జనవరిలో జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఓ ఫార్మా సంస్థ తన వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో వైద్యులు, సేల్స్మెన్ల కోసం పబ్‌లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు.ఏపీ నెల్లూరు నుంచి 20 మంది యువతులను రప్పించి వారితో అశ్లీల నృత్యాలు చేయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు... యువతులతో పాటు రేవ్ పార్టీ నిర్వాహకులను అరెస్ట్ చేశారు.