అక్రమ సంబంధానికి అడ్డువస్తున్న కన్న తండ్రిని ఏం చేసిందంటే?
వివరాల్లోకి వెళితే..ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో చోటుచేసుకుంది. బాధితుడిని అయోధ్య జిల్లాలోని శరథ గ్రామానికి చెందిన దర్భారీ లాల్ రావత్‌గా గుర్తించారు. వివరాలు.. 52 ఏళ్ల రావత్ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుతూరు రంజు ఇంటి సమీపంలో ఉండే రవి లోధి అనే వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం నచ్చని రావత్.. రవితో రిలేషన్‌షిప్ కట్ చేసుకోవాలని కూతురితో చెప్పాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది..
ఆ విషయం పై తండ్రి కూతుర్లు చాలా సార్లు గొడవ పడ్డారు.నిన్న ఉదయం రావత్ తన ఇంట్లో మృతిచెంది కనిపించాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రంజును అదుపులోకి తీసుకుని విచారించగా.. రావత్‌ను తానే చంపినట్టు నేరం అంగీకరించింది. అతడు నిద్రపోతున్న సమయంలో తాడుతో గొంతు నులిమి చంపినట్టు తెలిపింది.రావత్ మృతిపై విచారణ జరుపుతున్న సమయంలో అతని భార్య సునీతా దేవి.. పక్కింటి వ్యక్తి రవితో కూతురి రిలేషన్ షిప్‌కు అతడు వ్యతిరేకమని పోలీసులకు తెలిపింది.. ఈ విషయం పై కూతురి గట్టిగా అడగ్గా అసలు విషయం బయట పెట్టింది. దీంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు..