ఘోరం: అందరూ చూస్తుండగానే సచివాలయ ఉద్యోగి ఏం చేసిందంటే..!?

N.ANJI
సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. దేశంలో రోజురోజుకు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడే వారి సంఖ్యా పెరుగుతూనే ఉంది. ఇక చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంతో చాల మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మంచి జాబ్ వెల్ సెటిల్ లైఫ్ ని ఎంజాయ్ చేయాల్సింది పోయి ఆత్మహత్యలకు పాల్పడుతూ కన్నవారిని పుట్టెడు శోకసముద్రంలో ముంచేసి పోతున్నారు.
అయితే శనివారం మధ్యాహ్నం సమయం  12.45 గంటలు కావస్తోంది. ప్రయాణికులంతా ఎదురుగా వస్తున్న రైలు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో రైలు రానే వచ్చింది. స్టేషన్‌ లోకి వస్తుండగానే ఓ యువతి పట్టాలపై పరుగులు తీస్తోంది. అక్కడున్న ప్రతీ ఒక్కరూ కేకలు వేస్తున్నప్పటికీ ఎవరి గాభరాలో వాళ్లున్నారు. ఆ యువతి రైలుకు ఎదురుగా పట్టాలపై పడుకుండిపోయింది. అంతే రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ఆమె మృత్యువాత పడింది. దీనికి సంబంధించి రైల్వే జీఆర్పీ పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నర్సీపట్నానికి చెందిన అంకంరెడ్డి రాజ్యలక్ష్మి(26) స్థానిక విజయనగరం రైల్వేస్టేషన్‌ మూడో నంబర్‌ ఫ్లాట్‌ఫాంలో కూర్చుంది. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ అనౌన్స్‌మెంట్‌ విని నాల్గో నెంబర్‌ ప్లాట్‌ఫాంలోకి వెళ్లింది. అక్కడ కూర్చున్న ఆమె రైలు స్టేషన్‌లోకి రావడం గమనించింది. అంతే అందరూ చూస్తుండగానే పరుగులు తీసింది. ప్రయాణికులు, హమాలీలు కేకలు వేస్తుండగానే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆమె విశాఖ సచివాలయంలో వెల్పేర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
ఇక తల్లిదండ్రులు వెంకటరమణ, లక్ష్మి నర్సీపట్నంలో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మృతురాలి చెల్లి మహాలక్ష్మి హైదరాబాద్‌లో చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. ఆమెకు వ్యక్తిగత సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా అనేకోణంలో దర్యాప్తు చేస్తున్నామని, ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదని,  విచారణ చేపట్టామని జీఆర్పీ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: