కృష్ణా జిల్లాలో దారుణం.. మూగ‌ యువ‌తిపై అఘాయిత్యం

Spyder
బాలిక‌లు, మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వాలు ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తెచ్చినా అఘాయిత్యాలు ఆగ‌డం లేదు.  నిత్య ఏదో ఓ చోట ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా  కృష్ణా జిల్లా ముసునూరులో మూగ యువతి పై అత్యాచారం చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. యువతి ఎవరికి చెప్పదని పలుమార్లు అఘాయత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ వార్త పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


కొద్దిరోజుల క్రితం ఇదే జిల్లాకు చెందిన ఓ యువ‌తిని దారుణంగా అత్యాచారం చేశారు కొంత‌మంది యువ‌కులు. రాత్రివేళ రోడ్డుపై తండ్రి కోసం ఎదురుచూస్తున్న బాలికను అగంతకుడు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత నూజివీడు ట్రిపుల్ ఐటీ వెనక ఆమెను వదిలివెళ్లారు. అపస్మారక స్థితిలో పడి బాలికను పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు కృష్ణా జిల్లాలో గ‌డిచిన కొద్ది సంవ‌త్స‌రాలుగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. భారతావనిలో మహిళలపై అత్యాచారాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన ఈ గణాంకాలు అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


2018తో పోలిస్తే, 2019లో దేశ వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలు పెరిగాయలని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2019లో దేశంలో 87 వేల అత్యాచార కేసులు నమోదయ్యాయనీ..2020లో మహిళలపై పాల్పడిన నేరాలకు సంబంధించి 4.05 లక్షలకు పైగా కేసులు రిజిస్టర్ అయ్యాయని వెల్లడించింది. గతం కంటే అత్యాచారాలు 7.3శాతం పెరిగాయని తెలిపింది. అంటే ఏడాది ఏడాదికి అత్యాచారాలు పెరుగుతున్నాయని తేటతెల్లమవుతోంది. ‘క్రైమ్స్ ఇన్ ఇండియా – 2019’ పేరిట ఈ నివేదిక విడుదల కాగా, మహిళలపై నేరాలు 7.3 శాతం పెరిగాయని, ప్రతి లక్ష మంది మహిళల్లో 62.4 మంది అత్యాచారాలు, వేధింపులను ఎదుర్కొన్న వారేనని తెలిపింది. 2018లో మహిళలపై వివిధ రకాల నేరాలకు పాల్పడిన కేసులు 3,78,236గా ఉండగా, 2019లో వాటి సంఖ్య 4,05,861కి పెరిగాయని పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: