భర్తను భుజాన ఎత్తుకున్న భార్య‌ను చిత‌క‌బాదిన గ్రామస్తులు.. ఎందుకంటే?

Kavya Nekkanti
ప్ర‌స్తుతం క‌రోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌తిరోజు ఈ మ‌హ‌హ్మారికి వేల మంది బ‌లైపోతున్నారు. వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డం కూడా సాధ్యంకావ‌డం లేదు. క‌రోనా ఎక్క‌డ సోకుతుందో అన్న భ‌యంతో.. ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. అయితే ఇలాంటి ప‌రిస్థితుల్లో కూడా కొంద‌రి దారుణాల‌కు అడ్డు అదుపు ఉండ‌డం లేదు. తాజాగా త‌న భార్య‌కు తప్పు చేసిందని.. ఆమెకు వివాహేతర సంబంధం ఉంద‌ని భ‌ర్త ఆరోప‌ణ‌లు చేయ‌డంతో.. గ్రామ‌స్తులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ నిర్ణ‌యం వివాస్ప‌దంగా మార‌డంతో.. హాట్ టాపిక్‌గా మారారు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్లోని జాభువా జిల్లాలోని ఛప్రీ రన్వాస్ అనే గ్రామంలో కూలీలైన భార్యభర్తలు జీవిస్తుంటారు. అయితే తన భర్య‌కు అక్రమ సంబంధం ఉందంటూ భర్త ఆరోపించాడు. అతడి మాటలకు విలువనిస్తూ గ్రామస్థులు.. భర్తను భుజాన మోస్తూ రోడ్ల మీద తిరగాలన్న తీర్పుతో పాటు.. అలా నడుస్తున్న ఆమెను బంధువులు, గ్రామస్థులు కర్రలతో కొట్టే దారుణమైన శిక్షను అమలు చేశారు. అయితే ఈ శిక్ష‌‌ను అమ‌లు చేసే స‌మ‌యంలో కొంద‌రు ఫొటోలు తీయ‌డంలో.. అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ఇది చూసిన నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది ఏ మాత్రం సరికాదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక విష‌యం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. స‌ద‌రు బాధితురాలి భ‌ర్త‌తో పాటు మ‌రి కొంత‌మందిని అరెస్ట్ చేశారు. అనంత‌రం విచార‌ణ చేప‌ట్ట‌గా.. మధ్యప్రదేశ్ లో గిరిజన తెగలు ఎక్కువగా ఉండే కొన్ని జిల్లాల్లో ఇలాంటి దారుణ ఘ‌ట‌న‌లు ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రుగుతూనే ఉంటాయ‌ని తేలింది. అయితే వీటిపై స్థానిక నేతలు సైతం పట్టనట్లుగా వ్యవహరిస్తారని అక్క‌డవారు చెబుతున్నారు. ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న ఉద్దేశంతోనే స్థానిక నేతలు అలా వ్య‌వ‌హ‌రిస్తార‌ని అంటున్నారు. ఏదేమైనా.. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: