హడలెత్తించిన మరో ఎన్ కౌంటర్.. ఇందులోనూ యోగి మార్క్..?

praveen
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్... పేరు వినిపిస్తే చాలు నేరస్తుల గుండెలో గుబులు పుడుతుంది. ఎంత పెద్ద గ్యాంగ్ స్టర్ అయినా.. వెన్నులో వణుకు పుడుతుంది.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుండి  నేరాల  పై ఉక్కుపాదం మోపారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఒక సన్యాసి సీఎం ఏంటి అనే స్థాయి నుంచి.. ఇలాంటి సీఎం మాకెందుకు లేడు అని ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం అనుకునేలా తన పాలనలో ప్రభావితం చేస్తున్నాడు, దారుణ నేర చరిత్ర కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా యూపీలో నేరగాళ్ల ఏరివేత కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.



ఇప్పటికే ఎంతోమంది నేరగాళ్లను ఎన్కౌంటర్ చేసిన యూపీ సర్కార్ ఇటీవలే కరడుగట్టిన నేరస్థుడైన  వికాస్ దూభే ని  ఎన్కౌంటర్ చేయడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక వికాస్ ధూబే లాంటి కరడుగట్టిన నేరస్థులను  ఎన్కౌంటర్ చేయడంతో అండర్ గ్రౌండ్ లో నక్కి ఉన్న మరింతమంది క్రిమినల్స్ వెన్నులో వణుకు పుట్టింది. అయితే అండర్ గ్రౌండ్ లో దాక్కుని ఉన్న నేరస్తుల ఏరివేత కు  కూడా ప్రస్తుతం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది యూపీ సర్కార్. ఈ క్రమంలోనే ఇటీవలే మరో క్రిమినల్ ను  కూడా కాల్చి చంపింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బారాబంకి ప్రాంతంలో స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కపాలా  మరణించాడు.



పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన  అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు స్థానిక ఎస్పీ చెప్పుకొచ్చారు. కపాలా  కూడా అతి పెద్ద నేరస్తుడే అని... అతని తలపై కూడా లక్ష రూపాయల రివార్డు ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇంకా అండర్ గ్రౌండ్ లో దాక్కుని ఉన్న మరింత మంది క్రిమినల్స్  కోసం తాము వెతుకులాట ప్రారంభించామని... పోలీస్ అధికారులు తెలిపారు. అయితే యూపీలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతుండడం పై అటు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: