దారుణం : కామంతో ఊగిపోయిన కరోనా రోగి.. ఏకంగా క్వారంటైన్ సెంటర్లోనే..?
క్వారంటైన్ సెంటర్లో కూడా ఆడ పిల్లలకు కనీస రక్షణ లేకుండా పోయింది. కరోనా సోకి క్వారంటైన్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్న ఆడ పిల్లలు సైతం కామందుల బారిన పడుతూ ఉండడం మరింత సంచలనం గా మారిపోయింది. తాజాగా ఓ బాలిక క్వారంటైన్ కేంద్రంలో చికిత్స పొందుతుండగా ఓ యువకుడు బాలికపై కన్నేసి అతి దారుణంగా.. బాలికపై బాత్రూంలోని అత్యాచారానికి ఒడిగట్టాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ఓ 14 ఏళ్ళ బాలికకు కరోనా పాజిటివ్ అని వచ్చింది.దీంతో అధికారులు చెత్తార్ పూర్ లో ఉన్న సర్దార్ పటేల్ క్వారంటైన్ కేంద్రంలో కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇక అదే క్వారంటైన్ కేంద్రంలో కరోనా సోకిన ఓ యువకుడు చికిత్స తీసుకుంటున్నాడు. క్వారంటైన్ లో ఉంటూ కరోనా వైరస్ మహమ్మారి గురించి ఆందోళన చెందుతూ ఎలా బయట పడాలి అని ఆలోచించాలి గానీ... క్వారంటైన్ సెంటర్లో కూడా తన కామ బుద్ధుని బయటపడ్డాడు యువకుడు. 14 ఏళ్ల బాలిక పై కన్నేశాడు. ఎలాగైనా కామ వాంఛ తీర్చుకోవాలని సమయం కోసం ఎదురు చూసాడు. ఈనెల 15వ తేదీన రాత్రి సమయంలో బాలిక కాలకృత్యాల కోసం బాత్రూంకి వెళ్ళగా అదే అదనుగా భావించిన యువకుడు తన స్నేహితుడితో కలిసి... బాలికను బాత్రూం లోనే బంధించి అక్కడే దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఈ ఘటన సంచలనంగా మారగా రంగంలోకి దిగిన పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశారు.Powered by Froala Editor