దేవుడా.. పానిపూరిని ఇలా కూడా తింటారా?

Satvika
ఈ రోజుల్లో చాలా మంది భోజన ప్రియులు వింత వింత వంటలను ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా కొన్ని వింత ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అవి కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్త అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. దాన్ని చూసిన చాలా మంది వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు.. అసలు అంతగా పేరు తెచుకున్న ఆ వంట ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కొందరు నాన్ వెజ్ ఇష్టంగా లాగించేస్తుంటారు.. మరికొందరు అస్సలు తినరు. అలాగే రోజూ చేసే వంటకాలనే కాస్త విభిన్నంగా ట్రై చేస్తూ టెస్ట్ ఆస్వాదిస్తుంటారు. ఇక ఇటీవల సోషల్ మీడియా పుణ్యమా అని.. కొత్త కొత్తగా ట్రైచేస్తున్న వంటకాల వీడియోలను చూస్తూనే ఉన్నాం. అందులో కొన్ని వావ్ అనిపించగా.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తూ.. విగటు పుట్టిస్తాయి. తాజాగా పానీపూరితో శాండ్ విచ్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.పానీపూరి అంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా అమ్మాయిలకు ఎంతో ఇష్టంగా తింటుంటారు.. ఆ రుచి అంతగా అందరినీ ఆకర్షించింది. అందుకే డిమాండ్ కూడా రోజు రోజుకు పెరుగుపోతుంది..

కాలంలో రకరకాలుగా పానీపూరిని ట్రై చేస్తున్నారు. పానీపూరి అగ్ని అంటూ తెగ లాగించేస్తున్నారు. తాజాగా పానీపూరి సాండ్‏విచ్ అంటూ వీడియోస్ చేస్తున్నారు. ప్రముఖ ఫుడ్ బ్లాగర్ అంజలి థింగ్రా తన ఇన్‏స్టాలో పానీపూరి శాండ్‏విచ్ వీడియో షేర్ చేసింది. అందులో ఆమె.. బ్రౌన్ బ్రెడ్ పై ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ వేసి.. దానిపై టామోటాలు.. ఉల్లిపాయలు పేర్చి.. ఆ తర్వాత మరో బ్రెడ్ వేసి.. దానిపై పానీపూరి పేర్చింది. చివరగా.. దానికి మరో బ్రెడ్ జోడించి డై శాండ్‏విచ్ తయారు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. చాలా మంది ఫన్నిగా కామెంట్లు పెడుతున్నారు.... ఆ వింత మీరు ఒకసారి చూడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: