పాలకూర - శెనగపప్పు కాంబో అదుర్స్.. !
కావలిసిన పదార్ధాలు :
పాలకూర – 2 కట్టలు
టమాటో – 2
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 3
పచ్చి శనగ పప్పు – ½ కప్
అల్లం – కొద్దిగా
వెల్లుల్లి – 5 రెమ్మలు
కరివేపాకు – కొద్దగా
కొత్తిమీర – కొద్దగా
ఆయిల్ – 3 టేబుల్ స్పూన్స్
తాలింపు గింజలు – 1 స్పూన్
ఎండుమిర్చి – 2
సాల్ట్ – రుచికి తగినంత
పసుపు- ¼ స్పూన్
కారం – 2 స్పూన్స్
ధనియాల పొడి – 1 స్పూన్
గరం మసాలా – 1 స్పూన్
నీళ్లు -సరిపడా
తయారు చేయు విధానం :
ముందుగా పాలకూరను శుబ్రంగా కడిగి చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు ఒక విషయం తప్పక గుర్తు పెట్టుకోవాలి.అది ఏంటంటే పచ్చి శనగ పప్పును ముందుగా 5 గంటల ఆటో నాన పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది.స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో నూనె వేసి తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అనంతరం అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నుండి 3 నిముషాలు పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన పచ్చి శనగపప్పుని నీరు లేకుండా వేసి కలుపుకోవాలి. తరువాత టమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 5 నిముషాలు మగ్గనివాలి.ఆ తరువాత పాలకూర కూడా వేసి కలిపి ఒక ఐదు నిముషాలు ఉడకనివ్వండి. ఆ తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసి కలిపి కొద్దిగా నీరు కూడా పోసి మూత పెట్టి 5 నిముషాలు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఉడికించాలి.కూర దగ్గర పడిన తరువాత కొత్తిమీర జల్లుకుంటే బాగుంటుంది. !