ఈ జ్యుస్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు.. !!

Suma Kallamadi
క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎవరికి అయితే రక్త శాతం తక్కువగా ఉంటుందో వాళ్ళు క్యారెట్,బీట్ రోజు జ్యూస్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.రక్తం శాతం పెరగడంతో పాటు శరీరానికి శక్తి కూడా వస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఈ రెండు జ్యూసులను తాగుతూ ఉండండి.
1)క్యారెట్ జ్యూస్ :
కావాల్సిన పదార్ధాలు-
క్యారెట్-2
పావు టీ స్పూన్ పంచదార
1 టీ స్పూన్ నిమ్మ రసం
1/2 లీటర్ పాలు
 తయారు చేయు విధానం:
ముందుగా క్యారెట్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని  వాటిని మిక్సీ జార్ లో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.ఇప్పుడు గ్రైండ్ చేసిన క్యారెట్ జ్యూస్ ను వడకట్టి పిప్పి పారేసి జ్యూస్ మాత్రమే ఒక గ్లాసులోకి తీసుకోండి. అందులో పంచదార, పాలు పోసి ఒకసారి తిప్పి కావాలంటే  ఐస్ ముక్కలు కూడా  వేసుకోవచ్చు. వారానికి రెండు సార్లు అయినా ఈ జ్యూస్ తాగితే చాలా మంచిది
2)బీట్రూట్ జ్యూస్ : బీట్ రూట్ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దామా.!
కావలసిన పదార్ధాలు :
బీట్రూట్ – 2
పంచదార  – 1/2 కప్
సోంపు – 1/2 స్పూన్
యాలుకలు - 1
నీరు – 2 గ్లాసులు
ఐస్ క్యూబ్స్ - 5 to 6.
తయారు చేయు విధానం :
ముందుగా బీట్ రూట్  తొక్క తీసి చిన్న చిన్న  ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సి జార్ తీసుకొని, ఇందులో కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, పంచదార, ఇలాచి, కొద్దిగా నీళ్లు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు బీట్ రూట్ జ్యూస్ వడ గట్టి అందులోని పిప్పి తీసేయాలి.చల్ల చల్లగా తాగాలని అనుకునే వారు ఇందులో  ఐస్ క్యూబ్ వేసి సర్వ్ చేసుకోవాలి.ఐస్ క్యూబ్స్ వేయకపోయిన పర్వాలేదు.రక్త శాతం తక్కువగా ఉన్నవారు ఈ రెండు జ్యుస్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: