అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

Suma Kallamadi
ఈరోజు అమ్మవారికి ఎంతో ప్రీతి కరమైన రోజు కాబట్టి నైవేద్యంగా పెట్టడానికి మీకోసం సేమ్యా సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో వివరించబోతున్నాము. మేము చెప్పే విధంగా పాయసం తయారు చేసి చూడండి ఎంతో బాగుంటుంది.మరి ఆలస్యం చేయకుండా సగ్గుబియ్యం సేమ్యా ఎలా తయారు చేయాలో చూద్దామా.. ముందుగా కావలిసిన పదర్ధాలు ఏంటో ఒకసారి చూద్దామా.. 
కావాల్సిన పదార్ధాలు
1 కప్ సెమియా
1/4 కప్  సగ్గు బియ్యం
1 లీటర్ వేడి పాలు
1 స్పూన్ యాలకల పొడి
1/4 కప్  పచ్చి కొబ్బరి ముక్కలు
3 టేబుల్ స్పూన్  నెయ్యి
10 - 15 జీడి పప్పు
10 కిస్మిస్
1 కప్ బెల్లం
తయారీ విధానం :
ముందుగా సగ్గుబియ్యాని కొంచెం సేపు నీటిలో నానబెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో చిక్కటి పాలు పోసి ఒకసారి పాలు పొంగించండి. ఎందు కంటే ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి పాలు పొంగితే మంచిది. ఆ తరువాత చిన్న మంట మీద పాలు ని బాగా మరగనివ్వాలి.మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి పొయ్యి మీద ఒక పాన్ పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేపాలి.అలాగే కొబ్బరి కూడా వేపాలి.  అవి వేగిన తరువాత ఆ నెయ్యిలో సేమ్యాలు వేసి ఎర్రగా వేపాలి. అవి వేగిన తరువాత పొయ్యి మీద నీళ్లు పెట్టి కాచిన తరువాత అందులో సేమ్యా,సగ్గు బియ్యం వేసి కాగనివ్వాలి. సగ్గు బియ్యం, సేమ్యా ఉడికిన తరువాత అందులో బెల్లం చితకొట్టి వేయాలి.బెల్లం కరిగిన తర్వాత  అందులో ముందుగా కాచిన పాలు పోయాలి. తరువాత  యాలకల పొడి కూడా వేసి,జీడిపప్పు, కిస్మిస్ కొబ్బరి తురుము వేసి దించేయాలి. చూసారు కదా సగ్గు బియ్యం సేమ్యా ఎలా తయారు చేయాలో మరి ఆలస్యంం చేయకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: