పుదీనాతో ఇలా ఎప్పుడన్నా రైస్ చేసారా.?

Suma Kallamadi
అసలే వర్షాలు దంచి కొడుతున్నాయి.వాతావరణం అంతా చల్లగా మారిపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఎమన్నా తినాలని అనిపిస్తుంది కదా. అదే అండి నోటికి కాస్త ఘాటుగా, రుచిగా, వెరైటిగా వేడి వేడిగా పుదీనా రైస్ ట్రై చేసి చూడండి. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ రోజు ఇండియా హెరాల్డ్ వారు మీకోసం పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో మీకోసం వివరించబోతున్నారు.మరి ఆలస్యం చేయకుండా పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామా. !
కావాల్సిన పదార్ధాలు:
2 tsp నూనె
1 tsp నెయ్యి
1 బిరియానీ ఆకు
 దాల్చిన చెక్క కొద్దిగా
5 లవంగాలు
4 యాలకలు
1 పెద్ద ఉల్లి పాయ తరుగు
5 పచ్చిమిర్చి
1 tsp గరం మసాలా
1 tsp అల్లం వెల్లులి పేస్ట్
3 tsp పుదీనా పేస్ట్
1 పుదీనా – చిన్న కట్ట
1 tsp నిమ్మ రసం
వండుకున్న అన్నం
ఉప్పు
తయారీ విధానం::
ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టి అందులో కాస్త నూనె, నెయ్యి వేసి  వేడి చేసి అందులో మసాలా దీనుసులన్నీ ఒక్కొక్కటిగా వేసి వేపుకోవాలి.తరువాత ఉల్లిపాయ తరుగు, పచ్చి మిర్చి చీలికలు వేసి బాగా వేపాలి. ఉల్లి పాయలు వేగాక  ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లులి ముద్ద వేసి  వేపు కోవాలి.తరువాత అందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాకా చిన్న మంట మీద వేపుకోవాలి, నూనె పైకి తేలాక మళ్ళీ కొద్దిగా పుదీనా ఆకులు వేసి ఒక నిమిషం వేపండి. ఇప్పుడు అన్నం వేసి బాగా కలుపు కోవాలి. తరువాత ఉప్పు చూసుకుని చాలక పోతే మళ్ళీ వేసుకోండి. చివరిలో కొత్తి మీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. అంతే పుదీనా రైస్ రెడీ అయినట్లే. వేడి వేడిగా తినేయండి మరి. నిమ్మ కాయ పిండుకుంటే ఇంకాస్త రుచిగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: