అన్నంతో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?

Suma Kallamadi
ఈ రోజు ఇండియా హెరాల్డ్ వారు మీకోసం ఒక స్పెషల్ వంటకాన్ని మీకు పరిచయం చేయబోతున్నారు. ప్రతి రోజులాగా కాకుండా ఈ సారి కొత్తగా కొత్తి మీరా రైస్ ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది తినడానికి. మరి ఆలస్యం చేయకుండా కొత్తిమీర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా కావలిసిన పదార్ధాలు ఏంటో చూద్దామా.
కావాల్సిన పదార్ధాలు:
రెండు కప్పులు బియ్యం
ఒక పెద్ద కొత్తిమీర కట్ట
4 లేదా 6 పచ్చిమిర్చి
1 ఉల్లిపాయ
కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్
2 లేదా 3 టమోటాలు
తగినంత ఉప్పు
గరం మసాలా పొడి కొద్దిగా
2 టీ స్పూన్స్ నెయ్యి
6 లేదా 7 లవంగాలు
2 లేదా 3 యాలక్కాయలు
2 ముక్కలు దాల్చిన చెక్క
 తయారు చేయు విధానం:
 
ముందుగా స్టవ్ వెలిగించి దాని పైన ఒక వెడల్పాటి పాత్రను పెట్టాలి.ఇప్పుడు అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కాగిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి వేయించాలి.ఇప్పుడు వేయించిన కొత్తిమీర పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అన్నింటిని మిక్సీ జార్ లో వేసి మెత్తని  పేస్టులా వేసుకోవాలి.మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో నెయ్యి లేదంటే నూనె వేసి కాగిన తర్వాత అందులో లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్కలు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసి ఒక 5  నిముషాలపాటు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి పచ్చివాసన పోయేదాకా వేపాలి.తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న కొత్తిమీర పేస్టు వేసి కలపాలి. నూనె పైకి తేలేదాక వేపాలి. ఇప్పుడు ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల చొప్పున నీటిని పోయాలి. మనం రెండు కప్పుల బియ్యం తిసుకున్నాము కాబట్టి  నాలుగు కప్పుల నీటిని పోసి బాగా మరిగించాలి. ఇది మరుగుతుండగానే నానబెట్టిన బియ్యాన్ని వేసి ఒకసారి తిప్పాలి. ఇందులో కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేయాలి. తరువాత మూత పెట్టేయండి. కొంచెం సేపు అయ్యాక అన్నం మగ్గిన  తరువాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: