కాకరకాయతో ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా..?

Suma Kallamadi
కాకరకాయ అంటే చాలామంది ఇష్టంగా తినరు. ఎందుకంటే చేదుగా ఉండడం వలన కొంతమంది కాకరకాయ అంటే వామ్మో అంటారు. అయితే కాకరకాయ చేదు లేకుండా ఎలా వండాలో ఇండియా హెరాల్డ్ వారు మీకు వివరించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా కాకరకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామా.
కావాల్సిన పదార్ధాలు
కాకరగాయలు 250 గ్రా.లు
ఉల్లిపాయలు 2
పసుపు, 1/4 టీస్పూన్
కారం పొడి 1 టీస్పూన్
అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీస్పూన్
జీల కర్ర టీస్పూన్
మెంతులు 1/4 టీస్పూన్
నువ్వులు 4 టీస్పూన్
చింత పండు పులుసు 1/2 కప్పు
ఉప్పు తగినంత
కరివేపాకు 2 రెబ్బలు
నూనె 4 టీస్పూనులు
మజ్జిగ-కొన్ని
తయారు చేయు విధానం
ముందుగా కాకర కాయలను శుభ్రంగా కడిగి కాకరకాయలను  పైన చెంచాతో గీకేసి గుండ్రని చక్రాలుగా కోసి లోపలి గింజలు తీసేయాలి. ఇప్పుడు కాయలలో కొద్దిగా పసుపు, ఉప్పు, మజ్జిగ వేసి ఉడికించుకోవాలి.కాకర కాయ ముక్కలు ఉడికిన తరువాత స్టవ్ ఆపేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి అందులో నూనె పోసి  జీలకర్ర, మెంతులు, నువ్వులు దోరగా వేయిoచి గ్రైండర్ లో వేసి పొడి చేసుకోవాలి.మళ్ళీ అదే గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లి పాయ ముక్కలు వేసి మెత్త బడేవరకు వేపాలి. తరువాత అందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి నిదానంగా వేయించాలి.ఇప్పుడు అందులో ఉడికించుకున్న కాకరకాయ ముక్కలు వేయాలి. తర్వాత చింతపండు పులుసు పోయాలి. తరువాత తయారు చేసి పెట్టుకున్న నువ్వుల పొడి, బెల్లం,నీళ్లు పోసి  మూత పెట్టి ఉడికించాలి.ముక్కలు బాగా ఉడికి, నూనె, పైకి కనిపించే దాక ఉడకనివ్వాలి.అంతే కాకర కాయ పులుసు కూర రెడీ అయినట్లే. అయితే ఈ కూరలో బెల్లం వేయడం అనేది పూర్తిగా మీ ఇష్టం. ఎందుకంటే కొందరు బెల్లం వేస్తే తియ్యగా ఉంటుందని తినడానికి ఇష్టపడరు.బెల్లం వేయడం వలన చేదు అనేది అనిపించదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: