పెరుగుతో ఈ రెసిపి పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలా చేస్తే సరి .. !

Suma Kallamadi
గారెలు ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. గారెలు మన సంప్రదాయానికి పెట్టింది పేరు. ఇంటికి కొత్త అల్లుడు వచ్చినాగాని, పండగ అయినాగానీ తప్పకుండా గారెలు వండి తీరాలిసిందే. అయితే గారెలతో పెరుగు వడలు కూడా వేస్తారన్న విషయం మీకు తెలిసిందే. కానీ కొంతమందికి ఈ వడలు సరిగా రావు. గారెలు గట్టిగా ఉండడమో లేక పెరుగు విరిగిపోయినట్లు ఉండడంతో జరుగుతుంది. అందుకే ఇండియా హెరాల్డ్ వారు మీకోసం ఈరోజు పెరుగు వడలు పర్ఫెక్ట్ గా రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలో వివరించబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా కావలిసిన పదార్ధాలు ఏంటో చూడండి.
కావలిసిన పదార్ధాలు :
5 మినప వడలు( ముందుగా వేసుకుని ఉంచుకున్న గారెలు )
1 కప్పు లేదా 250 గ్రాములు గట్టి పెరుగు
౩/4 కప్పు నీళ్ళు
½ అంగుళం అల్లం ముక్క
౩ పచ్చిమిరపకాయలు
1 రెమ్మ కరివేపాకు
౩ రెమ్మలు కొత్తిమీర
½ tsp ఆవాలు
½ tsp జీలకర్ర
¼ tsp పసుపు
1 ఎండు మిరపకాయ
1 tbsp నూనె
చిటికెడు ఇంగువ
ఉప్పు -సరిపడా
 
కారం -సరిపడా
పసుపు -కొద్దిగా
తయారీ విధానం :
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో గట్టి పెరుగు వేసి ఆ పెరుగులో కొద్దిగా నీళ్ళు పోసి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా లేకుండా పెరుగును బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.ఆ చిలికిన పెరుగులో కొద్దిగా ఉప్పు, కారం కూడా వేయాలి. చిన్న కడాయిలో  నూనె వేసి వేడి చేయాలి.నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేసి చిటపటలాడే వరకు వేయించాలి.అల్లం తరుగు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి కొద్ది సెకన్లు వేయించాలి. స్టవ్ కట్టేసి తాలింపును ఒక రెండు నిమిషాలు చల్లార నివ్వాలి.తర్వాత పెరుగులో వేసి బాగా కలపాలి.ముందుగా చేసి పెట్టుకున్న మినప వడలను పెరుగులో వేసి మునిగేలా నొక్కాలి.పైన కొత్తిమీర తరుగు చల్లి ౩ నుండి 4 గంటల పాటు నాననివ్వాలి.తాలింపు చేయడం అవ్వగానే పెరుగు లో వేయకుండా ఒక్క నిమిషం ఆగి వేయాలి. ఇలా చేయడం వల్ల పెరుగు విరిగి పోయినట్లుగా అవదు.ఈ రెసిపీ కోసం తాజాగా ఉన్న తియ్యని పెరుగు తీసుకుంటే మంచిది. ఎందుకంటే గారెల్ని ౩ నుండి 4 గంటలు నానబెట్టేసరికి పెరుగు కాస్త పుల్లగా అవుతాయి. అంతే పెరుగు వడలు రెడీ అయినట్లే. !

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: